వావ్ ..వావ్ ..వావ్ సూపర్ ..బంపర్ ..డూపర్ బొమ్మ బ్లాక్ బస్టర్ ..ఇలా ఎన్ని చెప్పినా తక్కువే.. కేవలం మూడు అంటే మూడు నిమిషాల టీజర్ తోనే పుష్ప2 ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు క్లియర్గా చూపించేశాడు సుకుమార్ . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా పుష్ప . ఈ సినిమా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా అంతకంటే బిగ్గెస్ట్ రేంజ్ లో సక్సెస్ అందుకుంది .
రీసెంట్ గా ఈ సినిమాలో నటిస్తున్న హీరో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప2కు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కన్ను ఆర్పకుండా ప్రేక్షకులు చూసే విధంగా టీజర్ ను క్రియేట్ చేశారు సుక్కు. అంతేనా పుష్ప నే ఓ రేంజ్ లో ఉందంటే పుష్ప2 అంతకుమించిన మాస్ జాతరలా ఉంది .ప్రతి షాట్ ను సుకుమార్ చాలా కేర్ఫుల్ గా జనాల నాడిని పట్టి తెరకెక్కించాడు . మరి ముఖ్యంగా బన్నీ ఇంట్రడక్షన్ సీన్ టీజర్ కి హైలైట్ గా మారిందని చెప్పాలి .
పుష్ప సినిమాలో వాడిన పుష్ప.. పుష్పరాజ్ గేదెల డైలాగ్ ఇప్పటికి మన లైఫ్ లో వాడుతూనే ఉన్నాం. అలానే ఈ సినిమాలో కూడా పుష్ప మాస్ బోల్డ్ డైలాగ్స్ కుప్పలు కుప్పలుగా వాడినట్లు తెలుస్తుంది . అంతేకాదు సినిమా మొత్తానికి బన్నీ లుక్స్ కేక పెట్టించే విధంగా ఉన్నాయి . ఈ టీజర్ మొత్తానికి బన్ని కనిపించింది ఒకే ఒక్క షాట్. ఆ ఒక్క షాట్ లో కూదా ఇరగదీసేసాడు. ఆ లుక్స్ ఆ మాస్ యాంగిల్ బన్నీకి కరెక్ట్ గా సెట్ అయ్యాయి . ఈ క్రమంలోని టీజర్ లో కనిపించిన పులి కంటే బాగా భయపడుతున్నాడు బన్ని అంటూ పుష్ప ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు కొద్ది నిమిషాల ముందే రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో ఫాస్ట్ గా దూసుకుపోతుంది. సెకండ్ సెకండ్ కి టీజర్ చూస్తున్న వ్యూస్ లిస్ట్ మారిపోతుంది. బాక్సాఫీస్ వద్ద పుష్ప గాడు దుమ్ము దులపడానికి రెడీ అయిపోయాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!