శ్రియా.. ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతున్నా ఈ బ్యూటీ గ్లామర్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. దాంతో నటిగా శ్రియాకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ సత్తా చాటుతోంది. ఇటీవల కన్నడ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కబ్జలో మెరిసింది.
ఈ సినిమాలో ఆమె ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రియా వద్దకు మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందట. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తే.. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా అలరించబోతోంది. అయితే ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుందట. ఈ పాట కోసం మేకర్స్ శ్రియాను సంప్రదించగా.. ఆమెకు ఏకంగా కోటి రూపాయిలు అడిగిందట. శ్రియా డిమాండ్ కు నిర్మాతలు బెంబేలెత్తిపోయారట. అయితే ఫైనల్ గా ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా కన్ఫామ్ రావాల్సి ఉంది.