వార్ 2 కోసం అలాంటి పని చేస్తున్న తారక్.. అభిమానులకు దిమ్మ తిరిగే ట్వీస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న తారక్.. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుంది . ఈ క్రమంలోనే గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న తారక్..ప్రెసెంట్ తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎన్టీఆర్ థర్టీ సినిమాపై పెట్టాడు . త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది .

కాగా ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ లో బడా ఆఫర్ పట్టేసాడు. హృతిక్ రోషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన వార్ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. కాగా వార్ 2 సినిమాలో తారక్ కూడా నటించబోతున్నాడు . హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు .

ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న హృతిక్ రోషన్ కూడా అంతే చార్జ్ చేస్తున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం తారక్ ఈ సినిమా కోసం బాడీ వెయిట్ గైన్ అవుతున్నాడట . అంతేకాదు కండలు తిరిగిన విలన్ గా కనిపించడానికి ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమా థర్డ్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే సపరేట్ డైట్ ఫాలో అవుతూ .. వెయిట్ గైన్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడట . అంతేకాదు ఈ సినిమాలో గన్ కల్చర్ని ఎంకరేజ్ చేసే విధంగా తన క్యారెక్టర్ ఉండబోతుంది అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది . నందమూరి ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . తారక్ ఇలాంటి క్యారెక్టర్ ని ఎలా యాక్సెప్ట్ చేశారు అంటూ చర్చించుకుంటున్నారు..!!