ప్ర‌భాస్ బుద్ధి బ‌య‌ట‌పెట్టిన‌ తేజ.. అలాంటోడు కాబ‌ట్టే అంటూ హాట్ కామెంట్స్‌!

టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌, పాన్ ఇండియా స్టార్ స్టార్ ప్ర‌భాస్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. కేవ‌లం న‌టుడిగానే కాదు త‌న గొప్ప వ్య‌క్తిత్వం ద్వారా కూడా ప్ర‌భాస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు డార్లింగ్ ఎప్పుడూ దూర‌మే. అతడి మంచితనం, కల్మషం లేని మనస్తత్వం చూస్తే ఎంతో ముచ్చ‌టేస్తుంటుంది.

పాన్ ఇండియా స్టార్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ లో ఎలాంటి గ‌ర్వం ఉండ‌దు. ఇక ఇగో అన్న ప‌దం ఆయ‌న హిస్ట‌రీలోనే ఉండ‌దు. అయితే తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ ప్ర‌భాస్ బుద్ధి బ‌య‌ట‌పెట్టారు. `రామ‌బాణం` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ప్ర‌భాస్ స్నేహితుడు, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ను తేజ ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. అయితే ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడే తేజ‌.. ప్ర‌భాస్ పై హాట్ కామెంట్స్ చేశారు.

హీరోలంద‌రి క‌న్నా ప్రభాస్ వెయ్యి రెట్లు మంచి వాడని.. అతనితో పని చేసే వారంతా అతనికి ఎంతో గౌరవం ఇస్తారని తేజ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని కొనియాడారు. డార్లింగ్ కు ఎవరితోనూ విబేధాలు లేవని.. అందుకే అంతా ప్రభాస్ ను ఎంతో ఇష్ట పడుతుంటారని తేజ పేర్కొన్నారు. ఈయ‌న మాట‌ల‌కు డార్లింగ్ ఫ్యాన్స్ తెగ పొంగిపోతున్నారు. కాగా, రామ‌బాణం విష‌యానికి వ‌స్తే.. శ్రీ‌వాస్‌, గోపీచంద్ కాంబోలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ మూవీ ఇది. ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

Share post:

Latest