బుల్లితెరపై అనసూయ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగారు రష్మీ తన పుట్టినరోజును గ్రాండ్గా జరుపుకున్నట్లు తెలుస్తోంది.. తన ఫ్రెండ్స్ సమక్షంలో ఆమె రాత్రి భారీగా పుట్టిన రోజును జరుపుకుంది. ఈ బర్తడే ని ఆమె చాలా స్పెషల్ గా మార్చుకుందనే చెప్పాలి. ఏప్రిల్ 27న తన పుట్టినరోజును జరుపుకున్న రష్మీ నైట్ ఫ్రెండ్స్ సమక్షంలో బర్తడే సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుంది . ఇక ఈ పార్టీలో ఫ్రెండ్స్ తో పాటు రష్మీ గౌతమ్ కూడా బాగా ఎంజాయ్ చేసింది.
కొంటె పనులు.. చిలిపి చేష్టలతో ఫ్రెండ్స్ తో కలిసి చిందులేసింది. అంతేకాదు డాన్సులు, ముద్దులతో నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆయా ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
బ్లూ టాప్ ధరించిన రష్మీ గౌతమ్ మోకాళ్ళ పైకి ఉన్న టాప్లో తన లో అందాలతో యువతను మంత్రముగ్ధుల్ని చేసింది. రాత్రి సమయంలో చాలా హాట్ గా తయారైంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆయా ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్లను సైతం బాగా ఆకట్టుకుంటున్నాయి.
అంతేకాదు ఫోటోలతో పాటు ఒక కొటేషన్ కూడా షేర్ చేసింది. ఉండాలనుకునే వారికి కట్టుబడి ఉండండి.. వెళ్లాలనుకునే వారిని వదిలేయండి.. నా ఉనికి మరో ఏడాది యాడ్ అయ్యింది.. దానికి విలువ నిచ్చేలా నా వంతు కృషి చేస్తాను..బర్తడేని స్పెషల్ గా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నా జీవితంలో మూడు ప్రధాన స్తంభాలు.. నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చింది రష్మీ గౌతమ్. రష్మీ పెట్టిన ఫోటోలకు నేటిజెన్లు విషెస్ చెప్పడంతో పాటు క్యాప్షన్ బాగుందని.. కరెక్ట్ గా చెప్పారని కామెంట్లు చేస్తున్నారు.