అప్పుడు బాహుబ‌లి.. ఇప్పుడు ద‌స‌రా.. ఈ రెండు సినిమాల‌కు లింక్ ఏంటో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తొలి పాన్ ఇండియా చిత్రం `ద‌స‌రా` బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్ర‌లో న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది.

దీంతో తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నాని కెరీర్ లోనే హ‌య్యస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. నార్త్ ప్రేక్ష‌కుల‌ను కూడా ఈ మూవీ బాగానే మెప్పించింది. అయితే హిందీలో ఈ మూవీ హిట్ కావడానికి ప్రధానంగా ఓ కారణం వినిపిస్తోంది. అదే డ‌బ్బింగ్. అవును, ఏ డబ్బింగ్ చిత్రం అయినా విజయం సాధించాలి అంటే ప్రధానంగా డబ్బింగ్ బాగా కుదరాలి.

నటీనటుల బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా డబ్బింగ్ కుదరాలి. ద‌స‌రాలో నాని పాత్ర‌కు న‌టుడు శరద్ కేల్కర్ డ‌బ్బింగ్ చెప్పి అద‌ర‌గొట్టేశాడు. అయితే ద‌స‌రాకు, బాహుబలికి ఓ లింక్ ఉంది. రాజ‌మౌళి రూపొందించిన బాహుబలి రెండు భాగాల్లో ప్రభాస్ కి హిందీలో వాయిస్ అందించింది శరద్ కేల్కరే. అతడి గంభీరమైన వాయిస్‌ ప్రభాస్ కి చ‌క్క‌గా సెట్ అయింది. బాహుబలి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇప్పుడు ద‌స‌రాలో నాని బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గుట్లు డ‌బ్బింగ్ చెప్పి ఆక‌ట్టుకున్నాడు. బాలీవుడ్ లో ద‌స‌రా విజ‌యానికి పూల బాట ప‌రిచాడు.