స్టార్ హీరోపై మనీషా కొయిరాలా సంచలన వ్యాఖ్యలు

90వ దశకంలో అత్యంత అందమైన హీరోయిన్స్‌లలో మనీషా కొయిరాలా కూడా ఉన్నారు. తన నట జీవితంలో, ఆమె ఎన్నో సూపర్‌హిట్ సినిమాలలో పని చేసింది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఒక సినిమా కారణంగా తన సౌత్ ఇండస్ట్రీ కెరీర్ పూర్తిగా ఎలా ముగిసిందో వెల్లడించింది. రజనీకాంత్ తో నటించిన బాబా సినిమా వల్ల తన కెరీర్ డౌన్ ఫాల్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. మనీషా తన తాజా ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడింది. 2002 సంవత్సరంలో బాబా ఫ్లాప్ తన కెరీర్‌పై చాలా చెడు ప్రభావాన్ని చూపిందని తెలిపింది. ”బహుశా నా చివరి పెద్ద తమిళ చిత్రం బాబా. ఆ రోజుల్లో దారుణంగా ఫ్లాప్ అయింది. సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. అది డిజాస్టర్ అవడంతో నాకు సౌత్ సినిమాల నుండి ఆఫర్లు రావడం ఆగిపోయాయి”.

రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా గతేడాది బాబా సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా వసూళ్లు సాధించింది. అయితే 2002లో ఇది విడుదలైనప్పుడు డిజాస్టర్ గా మిగిలింది. రజనీకాంత్‌కి బాబా సినిమా చాలా ముఖ్యమైనది. బాబా సినిమాలో రజనీకాంత్ కేవలం హీరో మాత్రమే కాదు. దానికి దర్శకత్వం, స్క్రీన్ ప్లే, రచయిత బాధ్యతలు కూడా రజనీకాంత్ తీసుకున్నాడు.

దీనిపై మనీషా కొయిరాలా స్పందిస్తూ అలా వ్యాఖ్యానించింది. 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్‌కు భారీ వసూళ్లు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. మనీషా ఇటీవలే షెహజాదా చిత్రంలో కార్తీక్ ఆర్యన్ తల్లిగా కనిపించింది. ఈ చిత్రం తర్వాత, ఆమె త్వరలో సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది.

Share post:

Latest