ఐపీఎల్ లో ఆడిపాడేందుకు ర‌ష్మిక రెమ్యున‌రేష‌న్ తెలిస్తే గుండె ఆగిపోతుంది!

క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) 2023 మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం లో డిపెండింగ్‌ ఛాంపియన్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఇక‌పోతే ఈ సారి ఐపీఎల్ 2023 ఆరంభ వేడుక‌లకు గ్లామ‌ర్ ట‌చ్ కూడా ఇవ్వ‌బోతున్నారు. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా ఓపెనింగ్‌ సెర్మనీలో లైవ్‌ పెర్ఫామెన్స్ తో స్టేడియంను హోరెత్తించ‌బోతున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఆల్రెడీ ర‌ష్మిక‌, త‌మ‌న్నా అహ్మదాబాద్ బ‌య‌లుదేరారు. అయితే ఐపీఎల్ లో ఆడిపాడేందుకు ర‌ష్మిక పుచ్చుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది. సినిమాల‌కు మూడు కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ తీసుకునే ర‌ష్మిక‌.. ఐపీఎల్ లో లైవ్‌ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. చివ‌ర‌కు అటు చేసి ఇటు చేసి.. ఆమెను నాలుగున్న‌ర కోట్ల‌కు ఐపీఎల్ మేక‌ర్స్ ఒప్పించార‌ట‌. ఇక త‌మ‌న్నా మూడు కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటుంద‌ని టాక్‌.

Share post:

Latest