“ముందు నుయ్యి..వెనుక గొయ్యి”..ఇద్దరు తెలుగు హీరో ల మధ్య నలిగిపోతున్న సాయి పల్లవి..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి .. తెలుగు హీరోల చేతిలో నలిగిపోతుందా అంటే..? అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ముఖ్యంగా ఆమె నటించిన లాస్ట్ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి అని భావించిన సాయి పల్లవి కి తెలుగులో బోలెడు ఆఫర్లు వస్తున్నాయి . అయినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న పుష్ప2 సినిమాలో అమ్మడుకు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. పుష్ప 2 సినిమాలో కి సాయి పల్లవి సెలెక్ట్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఇప్పటికే ఈ సినిమా కోసం సాయి పల్లవి 14 రోజుల కాల్ షీట్లు సైతం ఫిక్స్ చేసినట్లు క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఇదే క్రమంలో మరో తెలుగు హీరో సినిమాలోను సాయి పల్లవి అవకాశము అందుకున్నట్లు తెలుస్తుంది . సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో ఇష్టపడి చేస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28 . ఈ సినిమా ఇప్పటికే రెండు షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది .మూడో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

ఈ క్రమంలోనే సినిమాలో మహేష్ చెల్లి పాత్ర కోసం సాయి పల్లవిని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది . కథ బాగుండడంతో సాయి పల్లవి ఈ సినిమా ను కూడా ఓకే చేసిందట. అయితే రెండు సినిమాలకు కాల్ షీట్స్ దగ్గరగా ఉండడంతో ఎటు తేల్చుకోలేని పొజిషన్లో సాయి పల్లవి ఉండిపోయింది అంటూ తెలుస్తుంది . రెండు సినిమాల కథ బాగా నచ్చాయి. ఫిమేల్ లీడ్ మరీ ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలే.. ఈ క్రమంలోనే అమ్మడు ఎటూ తేల్చుకోలేని పొజిషన్లో ఉండిపోయింది అంటూ తెలుస్తుంది . “ముందు నుయ్యి..వెనుక గొయ్యి” సామెతల సాయి పల్లవి ఇద్దరు హీరోల మధ్య కొట్టుమిట్టాడుతుంది .చూడాలి మరి సాయి పల్లవి అలాంటి డెసిషన్ తీసుకుంటుందో..? రెండు సినిమాలకు సైన్ చేసి.. రెండు సినిమాల్లోను నటిస్తే సాయి పల్లవి కెరియర్ దశ తిరిగిపోతుంది అనడంలో మాత్రం సందేహం లేదు..!!

 

Share post:

Latest