నాని, కీర్తి సురేష్ కాదు.. ధియేటర్స్ లో ఆమెను చూడగానే ముసలోల్లు కూడా అరుపులు, కేకలు.. ఆ ఫిగర్ అలాంటిది మరి..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరోగా పేరు సంపాదించిన నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని,, రీసెంట్గా నటించిన సినిమా దసరా . డెబ్ల్యు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిన్న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ నమోదు చేసుకుంది . కేవలం టాక్ పరంగానే కాదు కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫిస్ దుమ్ము దులిపేసింది.

ఇప్పటివరకు నాని కెరియర్ లో మనం చూసిన్నట్లయితే ఫస్ట్ షో తోనే ఇంతటి క్రేజీ టాక్ ను సంపాదించుకున్న ఏకైక సినిమాగా దసరా నిలిచింది . కథ పరంగా కంటెంట్ పరంగా ఎక్కడ నెగటివ్ మార్కింగ్ లేకుండా ఓ రేంజ్ లో విజృంభించేసిన శ్రీకాంత్ .. ఫస్ట్ సినిమాతోనే తన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని నమోదు చేసుకున్నాడు . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది .

కాగా థియేటర్స్ లో ఈ సినిమా చూస్తున్న జనాలు స్క్రీన్ పై కీర్తి సురేష్ కానీ నేచురల్ స్టార్ హీరో నాని బొమ్మ పడుతున్నప్పుడు వచ్చిన అరుపులు కేకలు పెద్దగా వినిపించట్లేదు కానీ .. తెరపై మాత్రం ఒకప్పటి నటి సిల్క్ స్మిత బొమ్మ పడగానే కుర్రాళ్ళు ఓ రేంజ్ లో అరుపులు కేకలతో థియేటర్స్ దద్దరిల్లిపోయేలా అరుస్తున్నారు. మరి ముఖ్యంగా థియేటర్స్ కి వచ్చిన ముసలోళ్ళు సైతం సిల్క్ స్మిత బొమ్మ పడగానే ఆమె పాట రాగానే అరుస్తూ చిందులేస్తుంటే ..ఆమె అంటే ఎంత ఇష్టమో జనాలకు తెలిసేలా చేస్తుంది .

ఈ జనరేషన్ వాళ్లకి సిల్క్ స్మిత అంటే తెలియకపోవచ్చు కానీ..అప్పట్లో ఓ ఊపు ఊపేసింది . కాగా కీర్తి సురేష్ లాంటి స్టార్ హీరోయిన్ సినిమాలో ఉన్నా సరే సిల్క్ స్మిత బొమ్మ పడగానే కుర్రాళ్ళు ఓ రేంజ్ లో అరుపులు అరుస్తున్నారంటే .. అప్పట్లో అమ్మడు హవా ఎంతగా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా సరే సిల్క్ స్మిత లాంటి నటి ఇక ఇండస్ట్రీలోకి రాదు రాబోదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు ..!!