డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయులు, మంచు బ్రదర్స్ మనోజ్-విష్ణు మధ్య విభేదాలు బట్టబయలు అయిన సంగతి తెలిసిందే. విష్ణు తన అనుచరులను, బంధువులతో ఎలా గొడవపడుతున్నాడో చూడండి అంటూ మనోజ్ నిన్న సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేయడంతో రచ్చ రచ్చ అయిపోయింది. అయితే ఆ వీడియోను మళ్లీ కొద్ది సేపటికే తొలగించాడు.
కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిన్న ఉదయం నుంచి ఇటు సోషల్ మీడియాతో పాటు అటు ప్రధాన మీడియాలోనూ మంచు బ్రదర్స్ గురించే చర్చలు జరుగుతున్నాయి. అయితే మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందించాడు. ఇది చాలా చిన్న గొడవ. మా మధ్య ఇలాంటివి సర్వసాధారణం అంటూ బదిలిచ్చాడు. మరోవైపు మనోజ్ విష్ణుతో ఫైట్ తర్వాత ఓ ట్వీట్ చేశాడు.
అయితే ఆ ట్వీట్ అన్నతో జరిగిన గొడవ గురించి కాదు. తమిళ స్టార్ హీరో అజిత్ కన్నతండ్రి పీ.సుబ్రహ్మణ్యం చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనోజ్ ‘సుబ్రహ్మణ్యం గారు చనిపోయిన విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాను, ఈ సందర్భంగా అజిత్ గారికి ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను’ అంటూ ఒక ట్వీట్ వేసాడు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక్క వీడియోతో ఇంటి పరువు రోడ్డుకెక్కించావు.. చేయాల్సింది చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు భలే నటిస్తున్నావు అంటూ మనోజ్ కు చురకలు వేస్తున్నారు.
Saddened to learn the passing away of #PSMani garu, May the departed soul rest in peace. 🙏
My deepest condolences to #Ajith garu and the entire family in this hour of grief.— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 24, 2023