ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ లాంగ్ గ్యాప్ తర్వాత తెరకెక్కించిన `రంగమార్తాండ` ఉగాది పండుగ కానుకగా మార్చి 22న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, జయలలిత, అనసూయ, ఆదర్శ్, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. మనసును తాకే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది.
తొలి ఆట నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు దక్కడంతో.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కృష్ణవంశీ భర్తగా పనికిరాడు.. దర్శకుడిగానే తనకు ఇష్టమంటూ రమ్యకృష్ణ కుండబద్దలు కొట్టేసింది. కృష్ణవంశీ డైరెక్షన్‌లో పనిచేయడం అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ అని, ఒక యాక్టర్ నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసని భర్తను ఆకాశానికి ఎత్తేసింది.
అలాగే ఇప్పటి వరకు తాను పనిచేసిన దర్శకులందరితో పోల్చితే వంశీతో వర్క్ చేయడం బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ అని ప్రశంసించింది. అంతేకాదు, భర్తగా కంటే తనకు వంశీ దర్శకుడిగా ఇష్టమని చెప్పి షాకిచ్చింది. అయితే గతంలో కృష్ణవంశీ కూడా భర్తగా తనని రమ్య భరిస్తుందని నిర్మొహమాటంగా చెప్పారు. ఇదే విషయాన్ని యాంకర్ గుర్తు చేయగా.. అందుకు రమ్యకృష్ణ సైతం అవును అని సమాధానం ఇవ్వడం గమనార్హం.