సమంతపైనే దిల్‌రాజు మనీ ఎందుకు పెడుతున్నాడంటూ గుణశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్!!

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ చిత్రం శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించారు. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాని కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తీసుకొని 3డీలో రూపొందించారు. ఈ సినిమా ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఇప్పటివరకు చేయనంత ఖర్చుతో శాకుంతలం సినిమాని చిత్రికరించారని గుణశేఖర్ చెప్తున్నారు. అలానే దిల్ రాజు ని ఉద్దేశించి ఏ నిర్మాత ఇంత పెట్టుబడి పెట్టలేదని కూడా అన్నారు.

నార్త్ లో కూడా ఈ సినిమాపై ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారట. అంతేకాకుండా చాలా మంది సమంత, గుణశేఖర్ కూతురు అని అనుకుంటున్నారట. అందుకే దిల్ రాజు భారీ మొతాన్ని ఖర్చు చేసారని అనుకుంటున్నారని గుణశేఖర్ వెల్లడించారు. ఈ సినిమాకి నిర్మాత గా ఉన్న నీలిమ గుణ కి దిల్ రాజు ఫైనాన్సియల్ గా బాగా సపోర్ట్ చేసారు. మొదట ఈ సినిమాని 2Dలో చిత్రికరించారు. ఏ తరువాత 3Dలో మార్చడానికి 6 నెలల వరకూ సమయం తీసుకున్నారు. దానికి చాలా ఖర్చు అయిందని దిల్ రాజు పేర్కొన్నారు. ఇక నిన్న హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో ఈ 3D ట్రయిల్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్బంగా దిల్ రాజు, గుణశేఖర్, నీలిమ గుణ, సాయిమాధవ్ బుర్రా, తదితరులు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్బంగా గుణశేఖర్ మాట్లాడుతూ ‘ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఆ టెక్నాలజీని దర్శకులే కాకుండా ఏమ్ ఎస్ రాజు, ఏమ్ ఎస్ రెడ్డి, దిల్ రాజు లాంటి నిర్మాతలు కూడా నమ్మారు. దాని వల్లనే ఆర్ ఆర్ ఆర్, శాకుంతలం లాంటి సినిమా లు తీయగలుగుతున్నాం. లేడీ ఓరియంటెడ్ సినిమాలన్నిటిలో శాకుంతలం ఒక కాస్ట్లీయస్ట్ ఫిల్మ్. లేడీ ఒరియాంటెడ్ సినిమాకి ఇంత ఖర్చు పెడతారా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. నార్త్ లో చాలా మంది సమంత, దిల్ రాజు కూతురేమో అందుకే అంతా బడ్జెట్ పెట్టారని అనుకుంటున్నారు. అసలు ఇలాంటి మైథాలాజీ సినిమాకి ఇన్ని కట్లో ఖర్చు చేసాడు. ఆయన ఏమైనా పిచ్చోడ అని కూడా అడుగుతున్నారు.’ అని గుణశేఖర్ చెప్పారు. ఇక శాకుంతలం సినిమా ఏప్రిల్ 14 న విడుదల కాబోతుంది.