RRR మూవీకి నిర్మాత చిరంజీవినా… అసలు సంగతి తెలిస్తే!!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దానయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు నిర్మిస్తుంటారు. అందుకే అందరూ దానయ్యను మెగా ఫ్యామిలీ బినామీ అని అంటుంటారు. అయితే ఇటీవలే ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి చరణ్ నిర్మాత అని కొంతమంది అంటుంటే, మరికొంతమందేమో చిరంజీవియే ఆ సినిమాకి నిర్మాత అని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు దానయ్య. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అందుకునే సమయంలో దానయ్య అక్కడ లేరనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం పై రకరకాల వార్తలు వస్తుండడంతో దానయ్య స్పందించారు.

దానయ్యకి పబ్లిసిటీ అంటే పెద్దగా ఇష్టం ఉండదంట. అందుకే పబ్లిసిటీ కి కాస్త దూరంగా ఉంటారట. 2006లో రాజమౌళి కి ఆయన ఒక చిన్న అడ్వాన్స్ ఇచ్చారని దానయ్య చెప్తున్నారు. అందుకే రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న సినిమాకి నిర్మాతగా దానయ్యకి అవకాశం ఇచ్చారట. ఆ సమయంలో ఏదైనా స్మాల్ మూవీకి అవకాశం ఇవ్వాలని రాజమౌళిని కోరగా ఆయన సరే అని మాటిచ్చారంట దానయ్యకి. ఇచ్చిన మాట ప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను దానయ్యకి అవకాశం ఇచ్చారట జకన్న. తాను డౌన్ ఎర్త్ నుండి వచ్చానని దానయ్య పేర్కొన్నారు. పబ్లిసిటీ అంటే ఇష్టం లేకపోవడం వల్లనే ఆస్కార్ వేడుకకి హాజరు కాలేదని క్లారిటీ ఇచ్చారు.

అలానే ఆర్ఆర్ఆర్ సినిమాని వదులుకుంటే కొంతమంది నిర్మాతలు 100 కోట్లు ఇస్తామన్నారనే ప్రచారం జరుగుతుంది. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఆర్ఆర్ఆర్‌లో చిరంజీవికి పార్ట్‌నర్‌షిప్ ఉందనే విషయంలో కూడా నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ నిర్మాత చిరంజీవి అని వచ్చే వార్తల్లో కూడా వాస్తవం లేదన్నారు.