రామ్ గోపాల్ వర్మ రోజురోజుకీ మరింత దిగజారిపోతున్నాడు?

రామ్ గోపాల్ వర్మ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమా చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, అందులో రాంగోపాల్ పేరు వినిపించక మానదు. తనదైన మేకింగ్ స్టైల్ తో అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడంటే తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో వెళ్ళిపోతోంది అని అంటున్నారు కానీ… వర్మ ఎప్పుడో ఆ పని చేసి చూపారు. తెలుగు సినిమాకి టెక్నాలజికల్ గా కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది ఆయనే అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. శివ, సత్య, సర్కార్, రంగేళి లాంటి సినిమాలు క్లాసిక్ మూవీస్ గా ఇండియా సినిమా చరిత్రలో నిలిచిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు.

అలాంటి రామ్ గోపాల్ వర్మ గత కొన్ని సంవత్సరాలుగా తన పేరుని తానే పాడు చేసుకునేలా వ్యవహరిస్తున్నారు. ఇంటర్వ్యూలలో రకరకాల వల్గర్ కామెంట్స్ చేయడం, సెక్స్ గురించి విచ్చలవిడి వ్యాఖ్యలు చేయడం ద్వారా తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నాగార్జున యూనివర్సిటీ కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన ఆయన, అక్కడ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు. రేపటి భవిష్యత్తు అని భావించే విద్యార్థులు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్పూర్తి కలిగించేలా మాట్లాడాల్సింది పోయి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు.

అక్కడ ఆయన… వ్యక్తిగత స్వార్థం, విచ్చలవిడి ఆలోచనా ధోరణని వాళ్ళకి ప్రబోధించడం జుగుప్సని కలిగిస్తుంది అని అంటున్నారు. సదరు యూనివర్సిటీ యాజమాన్యమే తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఎంచుకున్న రంగంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్లిన తరువాత కూడా సమాజం పట్ల ఆయనకు బాధ్యతలేకపోవడం ఏమిటి అని అంటున్నారు. శ్రీ రెడ్డి స్థాయికి వర్మను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయంటేనే క్రియేటివ్ జీనియస్ స్థాయి నుండి ఆయన ఎంత కిందకి దిగిపోయారో అర్దం చేసుకోవచ్చు.

Share post:

Latest