`సలార్` ఏపీ థియేట్రిక‌ల్ రైట్స్‌కు భారీ డిమాండ్.. ఎంతో తెలిస్తే షాకైపోతారు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో ఒక‌టే `స‌లార్‌`. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విల‌న్స్ గా అల‌రించ‌బోతున్నారు. హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కేజీఎఫ్ 2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ నుండి వ‌స్తున్న మూవీ కావ‌డం, ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తుండ‌టంతో ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇండియాన్ బాక్సాఫీస్ ను స‌లార్ షేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని ఫ్యాన్స్ న‌మ్మ‌కంగా ఉన్నాయి.

దీంతో షూటింగ్ కంప్లీట్ కాక‌ముందే ఈ మూవీకి ఊహించ‌ని స్థాయిలో బిజినెస్ జ‌రుగుతోంది. తాజాగా స‌లార్ ఏపీ థియేట్రిక‌ల్ రైట్స్ కోసం ఏకంగా రూ. 100 కోట్ల ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. నిర్మాత‌లు కూడా ఆ ఆఫ‌ర్ ప‌ట్ల సానుకూలంగా ఉన్నార‌ని.. మ‌రి కొద్ది రోజుల్లో డీల్ క్లోజ్ కానుంద‌ని టాక్ న‌డుస్తోంది. ఏదేమైనా ఏపీ థియేట్రిక‌ల్ రైట్స్ కే ఇంత భారీ మొత్తంలో డిమాండ్ ఏర్ప‌డ‌టం చూడా మూవీ ల‌వ‌ర్స్ షాకైపోతున్నారు. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా స‌లార్ థియేట్రికల్ రైట్స్ 200 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.