ఈ సినిమాలు టాలీవుడ్‌లో ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తాయా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తుంది. ఇప్పుడు రాబోయే 14 నెలల్లో దసరా, సలార్, ఎన్టీఆర్ 30 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ మూడు సినిమాలను వేరువేరు డైరెక్టర్లు తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆ హీరోల అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు సినిమాల బడ్జెట్ కూడా ఏకంగా 1000 కోట్ల దగ్గర ఉండటం గమనార్హం.

Major Update On NTR – Prashanth Neel Film - Filmify.in

ఈ సినిమాల కంటెంట్ మాత్రం క్లిక్ అయితే ఎవరు ఊహించని విధంగా చరిత్ర సృష్టిస్తాయని సోషల్ మీడియా వేదిక కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల రిలీజ్ డేట్లు సైతం ఆ సినిమాల మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా సింగరేణి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇక ఈ సినిమా మార్చి30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

Salaar Movie Latest News Updates

పాన్ ఇండియా హీరో ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్‌ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్‌ కూడా రికార్డు స్థాయిలో జరుగుతుంది.ఈ సినిమా బడ్జెట్‌తో పోలిస్తే రెండు రెట్ల రేంజ్‌లో బిజినెస్ జరుగుతుండం గమనార్హం. ఇక ఈ సలార్‌తో ప్రభాస్ బాహుబలి 2 రికార్డులు సైతం బ్రేక్ చేస్తాడని ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు. స‌లార్‌ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌కు జంటగా శృతిహాసన్ నటిస్తుంది.

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరైన కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలవకపోయినా ఇప్పటినుంచే భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో సంచనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు విలన్ గా గా నటిస్తున్నాడు.

Share post:

Latest