ఆ ఇద్ద‌రు హీరోల దెబ్బ‌తో టాలీవుడ్ మొత్తం బెంబేలెత్తుతోందా….!

మన టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఈ ఇద్దరు హీరోల దెబ్బకి సంక్రాంతి బరి నుంచి మిగిలిన హీరోలు తప్పుకున్నారు. ఈ సంక్రాంతికి పోటీకి దిగిన ఈ సీనియర్ హీరోలు మళ్లీ దసరాకి తమ సినిమాలతో పోటీకి దిగబోతున్నారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం మెగాస్టార్ భోళా శంక‌ర్‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ముందుగా ఆగస్టు నెల లో ప్రేక్షకుల ముందు తీసుకురావాలని చూసిన షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాని కూడా దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉండగా.. ప్రస్తుతం క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడితో తన 108వ సినిమా చేస్తున్నాడు.

Bhola Shankar (aka Bholaa Shankar) (2023) | Bhola Shankar Telugu Movie |  Bhola Shankar Cast & Crew, Story, Release Date, Review, Photos, Videos –  Filmibeat

ఆ సినిమా ని మొదటి నుంచి కూడా దసరా కి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టుకు పూర్తి చేసి దసరాకి ఈ సినిమాను ప్రేక్షకుల‌ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు హీరోలు సంక్రాంతికి తమ సినిమాలతో పోటీపడి మళ్లీ ఈ సంవత్సరం చివరిలో దసరాకి పోటీకి దిగుతున్నారు.

NBK 108: 'ఎన్‌బీకే 108' అప్‌డేట్స్ రిలీజ్ చేస్తున్నార‌ట‌!.. పండుగ అంటున్న  బాల‌కృష్ణ (Balakrishna) ఫ్యాన్స్

చిత్ర పరిశ్రమంలో అత్యంత కీలకమైన సంక్రాంతి, దసరా సీజన్లో ఇద్దరు పోటీ పడితే మిగిలిన హీరోల పరిస్థితి ఏమిటి అని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్న హీరోలకు, ఇతర హీరోలకు దసరా లేదా సంక్రాంతి వదిలిపెడితే బాగుంటుంది కదా అని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మ‌రి ఇద్దరి హీరోల్లో ఎవరు వెనక్కి తగ్గుతారు చూడాలి.

Share post:

Latest