తాజాగా మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో #SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేయడం జరిగింది. పూజ హెగ్డే, శ్రీలీల, భూమి పడ్నేకర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు అని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీమతి మమతా సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది ఇప్పటికే ఒక షెడ్యూల్ కి సంబంధించిన చిత్రీకరణ పూర్తవగా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ బయటకు రావడంతో మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.త్వరలోనే అంటే ఈ ఏడాది ఉగాది పండుగను పురస్కరించుకొని సినిమా అసలు టైటిల్ను ప్రకటించబోతున్నట్లు చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ చిత్రానికి ఏం పేరు పెట్టారనే విషయం ఇంకా బయటకు రాలేదు కానీ.. అదిరిపోయే టైటిల్ అంటూ మాత్రం హింట్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే మార్చ్ 22వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన సినిమా టైటిల్ను ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట.
మరొకవైపు ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు హారికా అండ్ హాసిని ప్రొడక్షన్ సంస్థ ఏకంగా రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను కూడా నెట్ఫ్లిక్స్ దాదాపు రూ.81 కోట్ల భారీ బడ్జెట్ తో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని సమాచారం.