PRABHASH-AKKINENI..సినీ పరిశ్రమలో కొన్ని రికార్డులు కేవలం కొంతమంది హీరోలకు మాత్రమే సొంతం అవుతూ ఉంటాయి. ఆ హీరోలు క్రియేట్ చేసిన రికార్డులు.. సృష్టించిన సంచలనాలను బ్రేక్ చేయాలని చాలామంది ప్రయత్నించినా.. వాటిని మాత్రం చెరపలేకపోతుంటారు. ఇదిలా ఉండగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు , కృష్ణంరాజు తర్వాత మెగాస్టార్ చిరంజీవి , నటసింహ బాలకృష్ణ , కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ , మోహన్ బాబు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ , ప్రభాస్ వరకు ఎవరికీ వారిది ఒక సపరేటు స్టైల్ అని చెప్పాలి. ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్.. మార్కెట్.. రికార్డ్స్.. కనీ విని ఎరుగని రీతిలో వసూలు రాబట్టడం.. ఇలా ఎన్నో వారు సాధించి అభిమానులను మెప్పిస్తూ ఉంటారు.
ఎవరికీ సాధ్యం కానీ.. చరిత్రలో నిలిచిపోయే సెన్సేషన్ క్రియేట్ చేసింది మాత్రం నట సామ్రాట్ ఏఎన్నార్, రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే అని చెప్పాలి.. ఇకపోతే వీరిద్దరూ మాత్రమే సాధించిన ఆ అరుదైన ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం. హీరోలు, దర్శకనిర్మాతలు చేసే ప్రతి చిత్రం కూడా మంచి విజయం సాధించాలని అనుకుంటారు. కొన్నిసార్లు అనుకున్న దానికంటే ఎక్కువ హిట్ కావడం.. కొన్నిసార్లు అంచనాలను తలకిందులు చేయడం జరుగుతూ ఉంటాయి.. ఇకపోతే వరుసగా హిట్టు కొట్టడం , హ్యాట్రిక్ , డబుల్ హ్యాట్రిక్ కొట్టిన కథానాయకులు కూడా ఉన్నారు. కానీ వరుసగా రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన హీరోలు మాత్రం ఎవరూ లేరు . ఆ రేర్ ఫీట్ అందుకున్నది మాత్రం అక్కినేని ప్రభాస్ మాత్రమే అని చెప్పాలి.
ఏఎన్ఆర్ నటించిన బాలరాజు (1948 ) ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఏడాది అంటే 1949లో ఆయన నటించిన కీలు గుర్రం సినిమా కూడా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ప్రభాస్ 2015లో బాహుబలి ది బిగినింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్గా నిలవగా.. 2017 లో బాహుబలి ది కంక్లూజన్ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్గా నిలిచారు . అలా వరుసగా రెండు సినిమాలతో ఈ ఘనత సాధించింది వీరిద్దరూ మాత్రమే.