చిల్లులు పడ్డ చొక్కా ద్వారా అందాలను ఆరబోస్తున్న శ్రీముఖి.. ఆహా అంటున్న ఫ్యాన్స్!

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ప్రస్తుతం ఏ ఛానెల్ లో చూసినా ఈ అమ్మడే దర్శనం ఇస్తుంది. బుల్లితెర పైనే కాకుండా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ పంట పండిస్తుంది. రకరకాల దుస్తులలో మెరుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఈమధ్య శ్రీముఖి అందాల ఆరబోతకు హద్దే ఉండడం లేదు. ఇక మా టీవీలో ప్రసారమయ్యే బిబి జోడి లో హోస్ట్ గా నిర్వహిస్తున్న శ్రీముఖి పోటీ బట్టలు ధరించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.ఈ షోలో సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్జిలు వ్యవహారిస్తున్నారు. ఒకప్పుడు బుల్లితెర పై గ్లామర్ ట్రీట్ చేసిన అనసూయ, రష్మిలను మించిపోయేలా శ్రీముఖి అందాలు అరబోస్తుంది.

వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీముఖి రెడ్ కలర్ డ్రెస్ ధరించి ఫొటో షూట్ చేయించుకుంది. అయితే ఆమె ధరించిన రెడ్ కలర్ టాప్ కాస్త వెరైటీగా ఉంది. ఇక డ్రెస్ చూసి కొంతమంది “ఈ గాలి బొక్కల చొక్కా చూస్తుంటే రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా గుర్తొస్తుంది” అని ఫన్నీ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం శ్రీముఖి రెడ్ హాట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జీ తెలుగు, మా టీవీ, ఈ టీవీ లాంటి ప్రముఖ ఛానెల్స్ లో వరుస షోస్ లో బిజీగా ఉన్న శ్రీముఖి హైదరాబాద్‌కి చెందిన ఒక వ్యాపారవేతని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి. అయితే శ్రీముఖి ఈ వార్తలను కొట్టిపారేసింది. పైగా ఆమెకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉదేశ్యం లేదని, ఆమె పక్కన ఉన్న వాళ్ళ నాన్న ఫోటోని బ్లర్ చేసి కాబోయే వరుడు అని ప్రచారం చేస్తున్న వాళ్ళపై శ్రీముఖి మండిపడింది. పెళ్లి చేసుకునేటప్పుడే నేనే అందరికి చెప్తాను, అంతేకాని లేని పోనీ పుకార్లు పుట్టించకండి అని ఆగ్రహం వ్యక్తం చేసింది.