“తమ్ముడు” నాని గాడికి అంత సీన్ ఉందా రా..? గొడవకి గీరుకుంటున్న స్టార్ హీరో ఫ్యాన్స్..!!

సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ లేకుండా వచ్చిన హీరో అంటే అందరికీ చులకనే. నెపోటిజం పేరుతో.. తాతలు పేర్లు తండ్రులు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి మేం పాన్ ఇండియా హీరోలము ..మేం స్టార్ హీరోలను వీర్ర వీగుతున్న కొందరు హీరోలు ఇండస్ట్రీలోకి సపోర్ట్ లేకుండా వచ్చిన హీరోస్ ను లెక్క చేయరు . తమ సినిమా ఫంక్షన్ అయినా తమ సినిమా రిలీజ్ తేదీ అయిన ఆ స్టార్ హీరోల కోసం వాయిదా వేసుకోవాల్సిందే . అలాంటి బిహేవియర్ ఇండస్ట్రీలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే . కానీ ఒప్పుకోవడానికి మనసు రాదు. అయితే వాళ్లు తానా అంటే వీళ్ళు తందానా అన్నట్టు స్టార్ హీరోలకి ఫాన్స్ సైతం వత్తాసు పలుకుతూ ఉంటారు .

ఈ క్రమంలోనే మరోసారి నాచురల్ స్టార్ నానిని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . మనకు తెలిసిందే పవర్ స్టార్ కి ఉన్న క్రేజ్ ..రేంజ్ ..ఫాన్ ఫాలోయింగ్ ఏ స్టార్ హీరోకి లేదని చెప్పాలి . ఆయన ని దేవుడితో భావిస్తారు ఫ్యాన్స్. ఆయన విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా తట్టుకోలేరు. ఇదే క్రమంలో రీసెంట్గా నాని నెక్స్ట్ సినిమాకి పవన్ కళ్యాణ్ కెరియర్ లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ ని పెట్టలి అనుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ దసరా చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న నాని ..ఆ తరువాత శౌర్యా దర్శకత్వంలో ” నాని30″ సినిమాలో నటించబోతున్నాడు .

ఈ సినిమా అయిపోయిన వెంటనే శైలాష్ తో “హిట్ 3” అనే సినిమా చేయబోతున్నాడు . ఇక ఆ తర్వాత పవన్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో మరో సినిమా కి కమిట్ అయ్యాడు నాని . దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నాడట . అయితే దీనికి పవన్ కళ్యాణ్ క్లాసిక్ సినిమా “తమ్ముడు” టైటిల్ ని ఫిక్స్ చేశారట . రేపో మాపో ఈ సినిమా టైటిల్ ని ఫిలిం చాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసేటట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ వార్త తెలిసిన పవన్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు.

నానికి పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ పెట్టుకునే అంత సత్తా ఉన్న మొనగాడా..? ఇప్పటికే గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టి ఆ సినిమాను చెడ దొబ్బారు.. ఇప్పుడు మరోసారి తమ్ముడు అంటూ పవన్ కళ్యాణ్ పై పడబోతున్నావా ..నీకు దండం రా సామి.. ఆ సినిమా టైటిల్ మార్చు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో నాని వ్శ్ పవన్ ఫ్యాన్స్ మధ్య రచ్చ రంబోలాగా మారింది..!!

Share post:

Latest