రొమాంటిక్ అండ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన జాతి రత్నాలు సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. హీరోయిన్గా మొదటి చిత్రం అయినప్పటికీ కూడా అద్భుతమైన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా తన క్యూట్ అండ్ స్మైలీ లుక్కుతో అందరిని కట్టిపడేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వచ్చిన అందులో ఆచితూచి పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నది. అయితే గత ఏడాది.. బంగార్రాజు చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ లు అలరించింది ఈ ముద్దుగుమ్మ.
సంతోష్ శోభన్ తో కలిసి ఒక చిత్రంలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఒకవైపు సినిమాలతో మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉంటూ ఫన్నీ రీల్స్ వీడియోను తన పర్సనల్ లైఫ్ విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది ఫరీయా అబ్దుల్లా.
అయితే రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ హైదరాబాదులో జరిగిన టచ్ ఫర్ చేంజ్ 2023 లో పాల్గొనింది ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖుల సైతం కూడా హాజరయ్యారు.అలా ఈ కార్యక్రమం లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ర్యాంపు వాక్ తో అందరిని ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ఈమె ధరించిన ట్రెడిషనల్ వేర్ డ్రెస్ అందరినీ ఆకట్టుకునేలా చేస్తోంది. తన డ్రెస్సింగ్ స్టైల్ తో బ్యూటిఫుల్ లొకేషన్ తో ఫోటోలు దిగి వాటిని షేర్ చేయడంతో అందరూ ఫరియా లుక్ కి స్టన్నింగ్ అవుతున్నారు. కుర్రకారులు సైతం ఈమె అందాన్ని చూసి అలాగే మైమరిచి పోతున్నారు.
ఫరియా ధరించిన ట్రెడిషనల్ వేరు కూడా అందరిని ఆకట్టుకుంటుంది పలు రకాల ఫోజులను సైతం అభిమానులకు షేర్ చేయడంతో మంత్రములవుతున్నారు.