ఆ డైరెక్ట‌ర్ పై మోజు ప‌డ్డ విద్యాబాల‌న్‌.. కోరిక తీర్చుకునేందుకు సిగ్గు లేకుండా అడిగింద‌ట‌!

విద్యాబాల‌న్‌.. ఈ బాలీవుడ్ న‌టి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పాత్ర ఏదైనా స‌రే ఇట్టే ఒదిగిపోయి నటించ‌డంలో తానుకు తానే సాటే. ఏక్తా కపూర్ ప్రసిద్ధ షో `హమ్ పాంచ్‌` తో కెరీర్ స్టార్ట్ చేసిన విద్యాబాల‌న్‌.. ఆ త‌ర్వాత యాడ్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపుల‌ర్ అయింది. సినిమాల్లో పెద్ద బ్రేక్ దక్కక ముందే సుమారు ఆపై యాడ్స్ చేసింది.

ఆపై బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విద్యాబాల‌న్ అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకుంది. న‌టిగా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న విద్యాబాల‌న్‌.. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ గుల్జార్ పై త‌న అభిమానాన్ని చాటుకుంది. గుల్జార్ సాబ్ అంటే త‌న‌కెంతో అభిమాన‌ని, ఆయ‌న‌తో క‌లిసి వ‌ర్క్ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నానని విద్యాబాల‌న్ తెలిపింది.

అంతేకాదు, గుల్జార్ పై మోజు ప‌డ్డ‌ విద్యాబాల‌న్‌.. తన కోరికను తీర్చుకునేందుకు సిగ్గు లేకుండా `ఏక్ యాడ్ ఫిల్మ్ క‌ర్ లీజియే మేరే సాథ్‌` అని చాలా సార్లు అడిగింద‌ట‌. ఇక‌ ఉడి అలెన్ తో కూడా ప‌ని చేయాల‌ని ఉందంటూ విద్యాబాల‌న్ చెప్పుకొచ్చింది. మ‌రి ఈమె కోరిక‌లు ఎప్ప‌టికీ తీర‌తాయో చూడాల్సి ఉంది. కాగా, జ‌న‌వ‌రి 1న విద్యాబాల‌న్ 43వ వ‌సంతంలోకి అడుగు పెట్టింది. భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్, కుటుంబ సభ్యులతో కలిసి ప్రైవేటుగా ఆమె నిన్న ఎంతో ఘ‌నంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది.