మామ అల్లుళ్ళతో.. బాలయ్య రచ్చ మామూలుగా లేదుగా..!

నటసింహం నందమూరి బాలకృష్ణని తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేసింది అన్ స్టాపబుల్ టాక్ షో.. అల్లు అరవింద్ కి వచ్చిన మాస్టర్ ప్లాన్ నుంచి వచ్చిన ఈ టాక్ షో.. తొలి తెలుగు ఓటీటీ ఆహాకు ఎంత పెద్ద హెల్ప్ అయిందో బాలయ్య కి కూడా అంతే హెల్ప్ అయింది. ఈ షో వాళ్ళ బాలయ్య ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ఆన్ స్టాపబుల్ షో.. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న రెండో సీజన్ కూడా ఎండింగ్ కి వచ్చింది.

ఇందులో లాస్ట్ ఎపిసోడ్ ని బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ గా ప్రమోట్ చేస్తున్న ఆహా.. ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రంగంలోకి తీసుకువచ్చారు. ఇదే తొలి సీజన్లో చివరి ఎపిసోడ్ ని మహేష్ బాబుతో ఎండ్ చేయగా.. ఇప్పుడు రెండో సీజన్ ని పవర్ స్టార్‌తో ఎండ్ చేస్తున్నారు. బాలయ్య- పవన్ కళ్యాణ్ కలిసి కనిపించడమే అరుదైన విషయం. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఓకే వేదికపై గంటపాటు మాట్లాడుకోవడం అంటే మామూలు విషయం కాదు..ఇటు మెగా నందమూరి అభిమానులకు మాత్రమే కాకుండా మొత్తం తెలుగు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టే ఎపిసోడ్ ఇది. త్వరలోనే స్టీమింగ్ చేయనున్నారు.

Pawan Kalyan shoots with Nandamuri Balakrishna for Unstoppable With NBK.  Leaked pics, videos - India Today

ఈ ఎపిసోడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఆహా టీమ్‌ ఇటీవలే ఈ ఎపిసోడ్ క్రేజీ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే భారీ వ్యూస్ ను దక్కించుకుని ట్రెండ్ క్రియేట్ చేసింది. బాలయ్య- పవన్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ బాప్ ఆఫ్ ఈ ఎపిసోడ్ అభిమానులకు మరింత కేక్ ఇచ్చే విధంగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఇందులో పాల్గొన్నారు.

Sai Dharam Tej In Pawan Kalyan - NBK Unstoppable 2 Show | cinejosh.com

పవన్ కళ్యాణ్ తన మేనల్లుళ్ల గురించి చెప్పే సమయంలో సాయి ధరమ్‌తేజ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పినా సందర్భంలో బాలయ్య తేజ్‌ను స్టేజ్ పైకి ఆహ్వానిచ్చినట్టు సమాచారం. సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత బయట పెద్దగా కనిపించలేదు. రీసెంట్ గా తన తమ్ముడు వైష్ణవ్‌ తేజ్ నటించిన ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. సాయిధరమ్ తేజ్ ఇలాంటి రియాల్టీ షోల్ కి రావటం చాలా అరుదు. సాయిధరమ్ తేజ్ కి బాలయ్య కి కూడా మంచి రిలేషన్షిప్ ఉంది. బాలకృష్ణతో కలిసి ఈ మామ అల్లుళ్లు చేసే సందడి ఎలా ఉంటుందో చూడాలి.