బాలయ్య షోలో కోలీవుడ్ బ్రదర్స్.. అల్లు అరవింద్ స్కెచ్ మామూలుగా లేదుగా..!

కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య- కార్తీ ఇటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. నిజ జీవితంలో వీరిద్దరూ బ్రదర్స్ అయినా వీరి సినిమాలు చూసేందుకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకే వీరి సినిమాలో కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన సక్సెస్ లేని ఈ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం వరుస‌ విజయాలతో సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోలుగా మారిపోయారు.

When Tamil superstar Suriya opened up on bullying younger brother Karthi: I  was so bad to him

సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఈ సినిమాలు తన నటనకు గాను జాతీయ అవార్డులు కూడా దక్కించుకున్నారు. గత సంవత్సరం కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్‌ సినిమాలో రోలెక్స్ పాత్రతో తనదైన మార్క్ నటనతో థియేటర్లను షేక్‌ చేశాడు. విక్రమ్ క్లైమాక్స్ కు సూర్య పాత్ర ప్రాణంపోసిందని సినీ ప్రేక్షకులతో పాటు సిని విశేషకులు కూడా మెచ్చే విధంగా తన నటనతో అదరగొట్టారు.

Watch Unstoppable Web Series Online in HD Quality - 1080 p

కార్తీ కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఖైదీ, పోనియన్ సెల్వన్‌, సర్దార్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్‌ల‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కార్తి నటించిన ఖైదీ సినిమాకు సిక్వల్ వ‌స్తే మాత్రం ఇందులో ఇద్దరు బ్రదర్స్ కలిసి నటించే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ టాక్ షోలో పాల్గొని పోతున్నారట. నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కు ఈ బ్రదర్స్ గెస్టులుగా రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా ప్రారంభించనున్నారని.. ఆహలో ఈ ఎపిసోడ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రానుందని మరికొందరు అంటున్నారు. ఇంకా దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. మరి ఈ ఇద్దరి స్టార్ హీరోలు బాలయ్యతో కలిసి రచ్చ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఇక దీంతో అల్లుఅరవింద్ కూడా ఆహా క్రేజ్ ను కోలీవుడ్ లో కూడా పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు తర్వాత కూడా మరికొందరు పాన్ ఇండియా హీరోలు బాలయ్య షోలో సందడి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Share post:

Latest