కొత్త లుక్ లో అదరగొడుతున్న కేజిఎఫ్ హీరో.. సినిమా కోసం అనుకుంటే పొరపాటే..!

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ ను దక్కించుకున్నాడు. ప్రశాంత్‌ నీల్ తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు కూడా యాష్ కు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఈ సినిమాల తర్వాత ఈ రాకింగ్ హీరో తన తర్వాత సినిమాను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు యాష్ తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో ఓ కొత్త వీడియోను షేర్ చేశాడు.

Yash | Zee News

ఆ వీడియోతో తన అభిమానులకు ఓ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇది యాష్ లేటెస్ట్ మూవీ అప్డేట్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ప్రముఖ కూల్ డ్రింక్స్ సంస్థ పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఈ కేజిఎఫ్ హీరో ఈ 10 సెకండ్ల కంటే తక్కువ నిడివి గల వీడియోను సోషల్ మీడియాతో తన అభిమానులతో పంచుకున్నాడు.

అందులో అతను పెప్సీని సిప్ చేసి, కంగ్రాచ్యులేషన్స్ పెప్సీ! ఐ లవ్ యూ అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలో, యష్ తదుపరి సినిమా కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లోహిత్ ఎన్‌కె నిర్మించడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఇక ఆ సినిమా దర్శకుడు నటీనటుల ఇతర వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)