పొత్తుపై తేల్చనున్న బీజేపీ..వేరే ఆప్షన్ లేదా?

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడానికి దాదాపు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఎలాగో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది..కానీ ఈ సారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి..రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందా? లేదా? అనేది కన్ఫ్యూజన్ గా ఉంది.

ఎందుకంటే ఇప్పుడు ఎలాగో బీజేపీ..జనసేనతో పొత్తులో ఉంది. పేరుకు పొత్తులో ఉంది గాని..ఎప్పుడు వారు కలిసి పనిచేయలేదు. దీంతో పవన్…టీడీపీకి దగ్గరవుతున్న విషయం తెలిసిందే. ఇటు బీజేపీ మాత్రం..టీడీపీతో కలవడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే పలుమార్లు టీడీపీతో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నామని, ఈ సారి టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని బీజేపీలోని కొందరు నేతలు చెబుతున్నారు.  అయితే బి‌జే‌పిలో మరికొందరు నేతలు ఏమో టీడీపీతో కలిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఒకవేళ పొత్తు లేకపోతే వారు బి‌జే‌పి నుంచి టి‌డి‌పిలోకి జంప్ అయ్యేలా ఉన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో రెండు రోజుల పాటు భీమవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో నేతలు పొత్తులపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. పొత్తుపై తమ అభిప్రాయాలని చెబుతారని సమాచారం. వారి అభిప్రాయాలని కేంద్రం పెద్దలకు వివరించనున్నారు. మెజారిటీ నేతల అభిప్రాయం మేరకు బి‌జే‌పి పొత్తుపై క్లారిటీ ఇవ్వనుంది. అయితే బి‌జే‌పి అధిష్టానమే పొత్తుపై తుది నిర్ణయం తీసుకోనుంది. చూడాలి మరి పొత్తులకు బి‌జే‌పి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో? లేదో?

Share post:

Latest