ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. 2004వ సంవత్సరంలో తెరకెక్కించిన ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా తో తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో హీరోగా రాజా నటించారు. హీరోయిన్గా కమలిని ముఖర్జీ నటించింది. ఈ తొలి చిత్రంతోనే హీరోయిన్గా ఈమె మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లోని సుమంత్ నటించిన గోదావరి అనే చిత్రంలో కూడా నటించింది. అటు తర్వాత గమ్యం, హ్యాపీడేస్, జల్సా వంటి సినిమాలలో కూడా నటించింది కమలిని ముఖర్జీ.

Kamalini Mukherjee Age, Family, Husband, Movies, Biography - Breezemasti

ఆ తర్వాత తన క్రేజీతో చివరిగా రామ్ చరణ్ తో కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే అనే సినిమాలో శ్రీకాంత్ కు జోడిగా నటించింది. తెలుగు మలయాళం వంటి భాషలలో నటించిన ఈమె అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకుల హృదయాలను చెరగని స్థాయిలో ఈమె నటన పాత్రలు ఉన్నాయని చెప్పవచ్చు అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నది కమలని ముఖర్జీ అయితే ఈమె సినిమాలకు ఎందుకు దూరంగా ఉందనే విషయం ఎవరికీ తెలియదు.

ఫోటో వివరణ అందుబాటులో లేదు.

దీంతో ఈ హీరోయిన్ గురించి అందరూ మర్చిపోవడం జరిగింది. అయితే తాజాగా కమిలిని ముఖర్జీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె గురించి హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అమెరికాలో ఉందని అక్కడ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. కమలిని ముఖర్జీ గతంలో కంటే ఇప్పుడు కాస్త బొద్దుగా కనిపిస్తోంది. దీంతో ఈమె ఫోటోలు చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.