సెన్సార్ రిపోర్టు ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా ఎలా ఉందంటే..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో మరొక హీరో రవితేజ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. వీరితోపాటు తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు కూడా గడిచిన కొద్దిసేపటి క్రితం పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా U/A సర్టిఫికెట్ లభించిందని తెలుస్తోంది.

Chiranjeevi with a dance number; Boss Party Song from 'Walter Veerayya'-  Waltair Veerayya, Boss Party,Chiranjeevi - time.news - Time News

అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి మార్కు తగ్గట్టుగానే ఈ చిత్రం ఉండబోతోంది అని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా లోని సన్నివేశాలు కూడా ఈ చిత్రానికి హైలెట్ గా కూడా ఉంటాయని సమాచారం. అలాగే రవితేజ ఎంట్రీ కూడా ఊహించని విధంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ ఎంట్రీ తోనే ఈ సినిమా కామెడీ ట్రాక్ మొదలవుతుందని సమాచారం. రవితేజ చిరంజీవి మధ్య వచ్చె సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది.

waltair veerayya censor completed | Vaartha Pipa News | PiPa News
క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశం కూడా ఈ సినిమా అంతటికి చాలా హైలైట్ గా ఉండబోతుందని సమాచారం. రవితేజ, చిరంజీవి మధ్య కూడా కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా చాలా హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి శృతిహాసన్ మధ్య జరిగే రొమాంటిక్ యాక్షన్ సన్నివేశాలు చాలా హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పాటలు కూడా ఈ సినిమాకి మరింత ప్లస్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా అభిమానులకు వాల్తేరు వీరయ్య ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.