అలియాభట్ అభిమానులకు చేదు వార్త… ఇక సినిమాలకు గుడ్ బై?

బాలీవుడ్ క్యూటీ అలియాభట్ గురించి తెలియని ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఉండనే వుండరు. నటుడు రణబీర్ ని పెళ్లిచేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి మాతృమూర్తి అయిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో అలియా భట్ సహా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందోత్సాహంతో వున్నారు. ప్రస్తుతం అలియాభట్ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. కాగా ఈ నేపథ్యంలో తల్లైన తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి మీడియా వారితో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ… ‘తల్లిగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను. దీంతో నా వ్యక్తిగత జీవితంలో భారీ మార్పులే చోటు చేసుకున్నాయి.’ అని అంది.

ఇంకా ఆమె మాట్లాడుతూ…. మునుపటి కంటే స్వేచ్ఛంగా ఆలోచిస్తున్నా. అలా ఎందుకు జరుగుతుందో నాకే తెలియదు. నాలో వచ్చిన ఈ మార్పులు నా నటనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో కూడా తెలియదు. పాత్రల ఎంపికలో కూడా నిర్ణయాలు ఎలా ఉండబోతాయో ఇప్పుడే చెప్పలేను. అని చెప్పుకొచ్చింది. ఇక ఆమె మాటలు పాజిటివ్ గానే వున్నా బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు మాత్రం అలియా వ్యాఖ్యల్ని బట్టి తనలో నటనపై ఆసక్తి తగ్గిందా? రిటైర్మెంట్ తీసుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే అలియా సినిమాల నుంచి నిష్ర్కమిస్తున్నట్లు ప్రకటనొస్తే మాత్రం ఎన్ని హృదయాలు తల్లడిల్లుతాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. దాంతో అలియా అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని చాలామంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్ధనలు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అలియాభట్ చేతిలో కొన్ని బాలీవుడ్ సినిమాలున్నాయి. అయితే ఈ సినిమాలు ఫినిష్ చేస్తుందో లేదో తెలియదు. అలాగే ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది. కానీ ఇంతలోనే అలియా వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో కలవరం రేపుతున్నాయి.

Share post:

Latest