BCCI: తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..అదిరిపోయే మ్యాచ్‌లు వచ్చేస్తున్నాయి..!

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చే కొత్త సంవత్సరం టీమిండియా వరుస మ్యాచ్‌లు తో బిజీ అవునుంది. శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్‌ల మ‌ద్య‌ ఇండియాలోనే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు 2022- 23 మ్యాచ్ ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇక విడుదల చేసిన షెడ్యూల్‌లో రెండు వన్డేలు మన తెలుగు రాష్ట్రాలు కూడా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్‌తో జనవరి 18 హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తర్వాత ఆస్ట్రేలియా తో మార్చి 19న వైజాగ్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల కు కేవలం మూడు నెలల వ్యవధిలోనే నాలుగు టెస్టులు, 9 వన్డేలు, ఆరు టి20 మ్యాచ్‌లను భారత్ ఆడనుంది. మూడు దశల వారీగా జరిగే ఈ మ్యాచ్‌ల‌ వివరాలు ఇలా ఉన్నాయి.

Team INDIA Schedule 2023: BCCI reveals PACKED schedule for home series against Sri Lanka, New Zealand, Australia

శ్రీలంకతో: మొదటగా భారత్ శ్రీలంకతో మూడు టి20 లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు జనవరి 3 నుంచి జనవరి 15వ తేదీ వరకు భారత్- శ్రీలంక మధ్య మ్యాచులు జరగనున్నాయి. ఆ మ్యాచ్‌ల సమయాలను వెల్లడించాల్సి ఉంది.

* మొదటి టీ20: జనవరి 3, ముంబయి

* రెండో టీ20: జనవరి 5, పుణె

* మూడో టీ20: జనవరి 7, రాజ్‌కోట్

వన్డేలు..

* తొలి వన్డే : జనవరి 10, గువాహటి

* రెండో వన్డే: జనవరి 12, కోల్‌కతా

* మూడో వన్డే: జనవరి 15, త్రివేండ్రం

India vs New Zealand 1st t20 match starts in Wellington 18th nov team india playing 11 indian cricket team hardik pandya captain|IND vs NZ: न्यूजीलैंड के खिलाफ टी20 सीरीज में पूरी तरह

న్యూజిలాండ్ తోను: తర్వాత టీమ్ ఇండియా న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, మూడు టి20 లో ఆడునుంది. శ్రీలంకతో సిరీస్ అయిన వెంటనే మూడు రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్‌తో సిరీస్ మొదలుకానుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్ భారత్‌తో తలపడనుంది.

* తొలి వన్డే మ్యాచ్‌: జనవరి 18, హైదరాబాద్‌

* రెండో వన్డే మ్యాచ్: జనవరి 21, రాయ్‌పుర్

* మూడో వన్డే మ్యాచ్: జనవరి 24, ఇందౌర్‌

టీ20లు..

* మొదటి టీ20: జనవరి 27, రాంచీ

* రెండో టీ20: జనవరి 29, లక్‌నవూ

* మూడో టీ20: ఫిబ్రవరి 1, అహ్మదాబాద్‌

IND vs AUS: Who won India vs Australia 1st T20I? Check the winner of Man of the Match Award

ఆస్ట్రేలియా తో: ఇక వీటి తర్వాత ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడినుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు ఎంతో సూపర్ క్రేజ్ ఉంది. ఈసారి ఈ రెండు జట్లు టెస్ట్ సిరీస్ తో తలపడనున్నాయి. ఈ టెస్ట్ సిరీస్ అయిన తర్వాత భారత్- ఆస్ట్రేలియా తో మూడు వన్డే మ్యాచ్‌లు కూడా ఆడున్నాయి. ఈ మ్యాచ్‌లు ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు నెల రోజులపాటు ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటన ఉంటుంది.

* తొలి టెస్టు మ్యాచ్‌: ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు, నాగ్‌పుర్

* రెండో టెస్టు మ్యాచ్‌: ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు, దిల్లీ

* మూడో టెస్టు మ్యాచ్‌: మార్చి 1 నుంచి 5 వరకు, ధర్మశాల

* నాలుగో టెస్టు మ్యాచ్‌: మార్చి 9 నుంచి మార్చి 13 వరకు, అహ్మదాబాద్‌

వన్డేలు

* మొదటి వన్డే: మార్చి 17, ముంబయి

* రెండో వన్డే: మార్చి 19, విశాఖపట్నం

* మూడో వన్డే: మార్చి 22, చెన్నై