ఈ సంవత్సరం పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సూపర్ హిట్ సినిమాలలో ఐఎండిబి ర్యాంకింగ్స్ లో త్రిబుల్ ఆర్ సినిమా అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఏడాది గూగుల్ ట్రెండ్ లో మాత్రం త్రిబుల్ ఆర్ తన స్థానాన్ని నిలుపుకోలేక పోయింది. అయితే ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ సినిమాలు జాబితా విడుదల చేసింది గూగుల్ అందులో త్రిబుల్ ఆర్ సినిమా నాలుగో స్థానానికి పడిపోయింది. గూగుల్‌లో భారీగా ట్రెండ్ అయిన భారతీయ సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచింది.
రణబీర్ కపూర్, అలియాభట్ నటించిన సినిమాపై నార్త్ ఇండియా లో భారీ చర్చ జరిగింది. ఈ కారణంగానే ఈ సినిమా గూగుల్లో మొదటి స్థానం రావడానికి కారణమైంది. అయితే రెండో స్థానంలో కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా నిలిచింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ నటించాడు. ఈ సినిమా దాదాపు మూడు వారాలపాటు ఆల్ ఇండియా గూగుల్ ట్రెండ్ లో కనిపించింది.
టాప్ టెన్ గూగుల్ ట్రెండ్స్ లో మూడో స్థానంలో ది కాశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో త్రిబుల్ ఆర్ సినిమాలు నిలవగా, కన్నడ నుంచి రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా సినిమా ఎవరు ఊహించని విధంగా 5 స్థానానికి ఎగబాకింది. ఈ ట్రెండ్స్ లో పుష్ప పార్ట్ 1న్ ను కాంతారా బీట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా మాత్రం గూగుల్ ట్రెండ్స్ లో పదో స్థానంలో చోటు దక్కించుకుంది.
ఏదేమైనా త్రిబుల్ ఆర్‌కు ఈ ర్యాంకింగ్‌లో 4వ స్థానం దక్కడం కాస్త మైనస్సే. అయితే ఈ లిస్టులో కూడా సౌత్ డామినేషన్ కచ్చితంగా కనిపిస్తుంది. 2022 గూగుల్ టాప్ ట్రెండింగ్ సినిమాల లిస్ట్ ఇదే. 1. బ్రహ్మాస్త్ర, 2. కేజీఎఫ్-2, 3. ది కశ్మీర్ ఫైల్స్, 4. ఆర్ఆర్ఆర్, 5. కాంతార, 6. పుష్ప, 7. విక్రమ్, 8. లాల్ సింగ్ చడ్డా, 9. దృశ్యం2, 10.థార్