కృతి స‌న‌న్ తో ప్రేమాయ‌ణం.. ఫైన‌ల్‌గా బాల‌య్య షోలో నోరు విప్పిన ప్ర‌భాస్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజులు నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్` సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ల‌బోతోంద‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఈ ప్రచారాన్ని ఆల్రెడీ కృతి సనన్ ఖండించింది. ఈ కేవలం రూమర్సే అని కొట్టి పడేసింది. ఇక తాజాగా ప్రభాస్ సైతం ఈ వార్తలపై నోరు విప్పాడు. ఇటీవల ఈయన నట‌సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపుల్ విత్ ఎన్‌బీకే`లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.

ఈ క్రమంలోనే బాలయ్య కృతి స‌న‌న్‌తో ప్రేమ, పెళ్లి అంటూ వస్తున్న‌ వార్తలు గురించి ప్రశ్నించాడు. అందుకు ప్రభాస్.. కృతి స‌న‌న్‌కు, తన‌కు మధ్య ఎలాంటి ప్రేమ లేదని.. కేవలం స్నేహం మాత్రమే ఉందని ప్రభాస్ స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని ఇప్పటికే కృతి కూడా క్లారిటీ ఇచ్చిందని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మరి ఈ క్లారిటీతో అయినా నెట్టింట‌ జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడుతుందా లేదా అన్నది చూడాలి.