న‌క్క తోక తొక్కిన ర‌ష్మిక‌.. అందుకేనా అంత త‌ల పొగ‌రు?

ఈ ఏడాది మొత్తం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వివాదాల కారణాంగా బీభత్సమైన ట్రోలింగ్ కు గురవుతూనే ఉంది. ముఖ్యంగా `కాంతార` సినిమా కారణంగా రష్మికపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. క‌న్న‌డ‌ పరిశ్రమలో ఆమెను బ్యాన్ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఇక కాంతార‌ వివాదం ముగిసే లోపే ఈ అమ్మడు సౌత్ పై సంచల‌న‌ వ్యాఖ్యలు చేసే మ‌ళ్లీ విమర్శల పాలవుతోంది.

రీసెంట్గా `మిషన్ మజ్ను` ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ చాలా బాగుంటాయని, సౌత్ లో మసాలా సాంగ్స్, ఐటం సాంగ్స్ తప్ప ఏమీ ఉండవంటూ ఎద్దేవ చేసింది. దీంతో సౌత్ సినీ ప్రియులు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే రష్మిక ఇలా తల పొగరుగా మాట్లాడడం వెనుక ఓ కారణం ఇప్పుడు బలం గా వినిపిస్తోంది.

బాలీవుడ్ లో మన రాజమౌళి అంతటి పేరును సంపాదించుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈయన సినిమాల్లో నటించాలని ప్రతి ఒక్కరు తహతహలాడుతుంటారు. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే నక్క తోక తక్కినట్టే అని భావిస్తుంటారు. అయితే తాజాగా అలాంటి అద్భుత అవకాశాన్నే రష్మిక ద‌క్కించుకుందని అంటున్నారు. ఇటీవల రష్మిక ముంబైలోని సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్ నుండి బయటకు వెళ్తూ మీడియా కంట పడింది. దీంతో ఆయ‌న‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక భారీ చిత్రంలో రష్మిక ఒక హీరోయిన్ గా ఎంపిక అయ్యిందనే వార్తలు బాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.