బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌కు హీరోయిన్లు అందుకే భ‌య‌ప‌డుతున్నారా ?

మన తెలుగులో ఎన్ని ప్రముఖ ఓటీటీ లు ఉన్న ఆహా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం అందిస్తున్న ఓటీటీగా ఆహా పాపులర్ అయింది. అల్లు అరవింద్ ముందుచూపుతో తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ గా వచ్చిన ఆహా ప్రస్తుతం ఎన్నో సెన్సేషన్లు క్రియేట్ చేస్తుంది. ఇక ఈ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది.
అల్లు అరవింద్ కోసం బాలకృష్ణ తన కెరియర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా చేస్తున్న షో కూడా ఇదే.

Watch Unstoppable Season 2 Episode 1 on aha in HD Quality Stream Now.

ఇప్పటికే ఓ సీజన్ ను కంప్లీట్ చేసుకుని రెండో సీజన్‌ కూడా ఎవరు ఊహించని రీతిలో బ్లాక్ బాస్టర్ షోగాా నిలిచింది.అయితే ఈ షోకి ఎక్కువ‌గా హీరోలు రావ‌డం కూడా ఇప్పుడు అంద‌ర్ని కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దినికి ప్ర‌ద‌న కార‌ణం బాలకృష్ణ అడిగే ఇబ్బందికర ప్రశ్నలకి, సెటైర్‌ డైలాగ్ ల కి హీరోయిన్లు భయపడి.. అనవసరంగా అందరి ముందు ఎందుకు అవమాన పడాలి అని ఈ షో కి దూరంగా వుంటున్నారని పరిశ్రమలో వినిపిస్తున్న టాక్.

Unstoppable with NBK 2 Episode 6 Release Date, Guests, Promo & More -  JanBharat Times

దింతో కొంతమంది మాత్రం అన్ స్టాపబుల్ షోను బూతు షో అని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ షోకు గెస్ట్‌లుగా వ‌స్తున్నా హీరోలు ప్రధానంగా హీరోయిన్లతో ఎఫ్‌ర్‌ల‌ గురించి ప్రశ్నలు అడుగుతూ ఉండటం ఇప్పుడు ఇది హాట్‌ టాపిక్ గా మారింది. అన్‌స్టాప‌బుల్‌ షోలో బోల్డ్‌ ప్రశ్నలు ఎక్కువయ్యాయని. మరి కొంతమంది అంటున్నారు. ఈ షోకు సెన్సార్ లేకపోవడంతో కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేయకుండా ప్రసారం చేస్తున్నారనినే కామెంట్లు కూడా వస్తున్నాయి.

అయితే మరి కొంతమంది సెలబ్రిటీలు ఈ షోలో అడుగుతున్న ప్రశ్నల వల్ల ఇబ్బందులు పడుతున్నారని సమాచారం కూడా అందుతుంది. అయితే త్వ‌ర‌లోనే ఈ షోకు సీనియ‌ర్ హీరోయిన్లు జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌తో పాటు యంగ్ హీరోయిన్ రాశీఖ‌న్నా క‌లిసి వ‌చ్చిన‌ సంగ‌తి తెలిసిందే.