“పని పాట లేక ఆ సినిమా చేయలేదు”.. ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన పూజా హెగ్డే..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుందో అందరికీ తెలిసిందే. ఈ ఏడాదిలో వరుసగా మూడు డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే.. ఏడాది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే వచ్చింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఈ ఇయర్ పూజ హెగ్డే కి డిజాస్టర్ అనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆమె కాళ్లు ఇంజురీ అవడం వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . నతించిన మూడు సినిమాలు బొక్క బోర్ల పడడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైంది.

రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి సర్కస్ అనే సినిమాలో కలిసిన నటించింది . ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది . అయితే ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది . దీంతో దీనిపై పెట్టుకున్న ఆశలు కూడా నిరాశగానే మిగిలాయి . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజ హెగ్డే మాట్లాడుతూ ..”ఈ సినిమా నేను చేసింది డైరెక్టర్ రోహిత్ శెట్టి కోసం.. నేను ఈ సినిమాను చేయడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి.. నేను కథ కూడా వినలేదు ..కంటెంట్ ఏదో కూడా నాకు తెలియదు”.

“కేవలం రోహిత్ శెట్టి డైరెక్షన్లో నటించడానికే.. ఈ సినిమాని ఓకే చేశాను . ఆయన ఈ సినిమాలో నాకు ఆఫర్ ఇవ్వడానికి కాల్ చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను.. ఈ క్రమంలోనే మా మమ్మీ కాల్ బ్యాక్ చేయమంది . కాగా నేను కాల్ బ్యాక్ చేసిన వెంటనే ఆయన మీకు డేట్స్ అడ్జేస్ట్ చేయగలరా అని అడగగానే.. ఎలాగోలా సర్దుబాటు చేస్తాను సార్ అని చెప్పాను. నేను పని పాట లేక ఖాళీగా కూర్చోలేదు ..ఫుల్ బిజీగా ఉన్నాను. మంచి సినిమాలు వస్తే చేద్దామని ఆలోచిస్తున్నాను . అంతే ఇవేమీ ట్రోలర్స్ కి తెలియవు కదా ..?” అంటూ తన దైన స్టైల్ లో ఇచ్చిపడేసింది.