బిగ్ ట్విస్ట్..టీడీపీతో బీజేపీ పొత్తు..పక్కా క్లారిటీ..!

బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవల తెలంగాణలోని ఖమ్మంలో భారీ సభ పెట్టి మళ్ళీ..టీడీపీని యాక్టివ్ చేస్తున్నారు. ఇంకా తమ బలం తగ్గలేదని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో తమకు బలం ఉందని చూపించి..బీజేపీతో పొత్తు పెట్టుకుని, తెలంగాణలో బీజేపీకి సహకరించి..ఏపీలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని బాబు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

నిజానికి ఏపీలో బీజేపీ బలం జీరో..కాకపోతే పొత్తు ఉంటే కేంద్రం సపోర్ట్ ఉంటుందని, అధికార బలం కలిసొస్తుందని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందు తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్లాలని బాబు చూస్తున్నారని అంటున్నారు. అయితే టీడీపీతో పొత్తుకు తెలంగాణ బీజేపీ నేతలు ఏ మాత్రం రెడీగా లేరు. తాజాగా రాష్ట్ర బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్, విజయశాంతి…టీడీపీతో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై క్లారిటీ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.

2018 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది..టీడీపీతో పొత్తు వల్ల తెలంగాణ సెంటిమెంట్ రాజేసి మళ్ళీ కేసీఆర్ లబ్ది పొందారని కాబట్టి టీడీపీతో పొత్తు వల్ల నష్టమే ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే దీనిపై బీజేపీ అధిష్టానం ఏమి క్లారిటీ ఇవ్వలేదు..కానీ టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని బండి సానే క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశం పార్టీ కార్యకర్తలకు ఇదే తెలియచేయాలని సూచించారు. పార్టీ శ్రేణులకు పొత్తులు ఉండవనే విషయాన్ని స్పష్టం చేయాలని బండి సంజయ్ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.

ఇదివరకే తెలగాణలో జనసేనతో కూడా పొత్తు ఉండదని బండి చెప్పారు..అంటే తెలంగాణలో సింగిల్ గానే బీజేపీ ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.