జూనియర్ ఎన్టీఆర్‌కు , టిడిపి పార్టీకి ఎంతో ఋణానుబంధం ఉంది. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ ఆ పార్టీకి తన వంతు సాయం చేస్తూ ఆ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఎంతో మంది ఆయనపై విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా ఎన్టీఆర్ ముందుకు వెళ్లి పోతున్నారు. ఇతర పార్టీల నుంచి మంచి ఆఫర్లు వచ్చిన ఎన్టీఆర్ తాతగారి మీద గౌరవంతో అయన స్థాపించిన పార్టీకే నా ప్రాధాన్యత అని ఎన్నో సందర్భాల్లో తేల్చి చెప్పాడు.
నా అవసరం రాజకీయాలకు ఎప్పుడు ఉంటుందో అప్పుడు సరైన సమయం చూసుకొని ఎంట్రీ ఇస్తానని ఎన్టీఆర్ కామెంట్లు కూడా చేశారు. అయితే ఈ రాజకీయాలలో ఎన్టీఆర్‌ను ఎదగకుండా తొక్కేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. లోకేష్ కు అడ్డు వస్తాడని ఎన్టీఆర్‌ను పాతాళానికి తొక్కేస్తున్నారని కొడాలి నాని అన్నాడు. ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్టీఆర్ పేరు లేకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ పావులు కుదుపుతుందని ఓ మీటింగ్‌లో ఈ కామెంట్లు చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
చంద్రబాబు కావాలని లోకేష్ ను ప్రజలపై వదులుతున్నాడని కొడాలి నాని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో పాటు రాష్ట్రంలో బీసీలను సమూలంగా నాశనం చేసే కుట్ర కూడా జరుగుతుందని కొడాలి నాని చెప్పుకొచ్చాడు. సీనియర్ ఎన్టీఆర్, వైయస్సార్ కు ఉన్న దమ్ము జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని కొడాలి నాని చెప్పుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను జగన్ మాత్రమే కాపాడుతారని ప్రజలు అంత ఆయన వెంటనే ఉన్నారని ఆయన కామెంట్లు చేశారు.
అయితే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ కొడాలి నాని కలిసి కనిపించిన సందర్భాలు ఎక్కడా లేవు.. వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే వీరిద్దరీ బంధం బలంగా ఉండాలని ఇరు అభిమనులు కోరుకుంటున్నారు. కొడాలి నాని, ఎన్టీఆర్ కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.