పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇటు రాజకీయాలను, అటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళడానికి వారాహి అనే ఒక కొత్త బస్సును ప్రత్యేకంగా తయారు చేయించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మొత్తం పవన్ వారాహి బస్సు చుట్టూనే తిరుగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా పోస్టులతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కిస్తున్నాడు.
నిన్న ఉదయం నుంచి పవన్ కు వైసీపీ నేతలకు మధ్య కౌంటర్లు సెటైర్లతో కూడిన పోస్టుల తో జరిగిన రాజకీయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గతంలోల కాకుండా రాజకీయాలలో తనదైన స్టైల్ లో ఒక మాటకు మరో మాట టక్కున అంటూ అసలు సిసలైన నేటి రాజకీయాలను వంట పట్టించుకున్నాడు. సినిమాల విషయంలో కూడా ఫ్యాన్స్ ని ఏం మాత్రం నిరుత్సాహపరచడం లేదు. వరుస సినిమాలను కమిట్ అవుతూ వీలు చిక్కినప్పుడల్లా షూటింగ్ చేస్తూ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు పవన్ అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. పవన్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి జల్సా సినిమా వరకు అన్ని సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనిపించాడు. తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న పవన్ తాజాగా నటిస్తున్న హరిహర వీరమల్లు కోసం మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ: ‘పవన్ కళ్యాణ్ ఆ ఫోటోకి ఈ విధంగా కామెంట్ ఇచ్చాడు.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అంటూ ఆ ఫోటో కింద రాసుకోవచ్చాడు’. ఇప్పుడు ఆ ఫోటో పవన్ ఫ్యాన్స్ కు ఎంతో కిక్ ఇస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తన కెరియర్ మొదట్లో ఎలా ఉన్నాడో పవన్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నానంటూ రెండు ఫోటోలను పక్క పక్కనపెట్టి అభిమానులకు షేర్ చేశారు.
After two decades I got into my Martial Arts practice. pic.twitter.com/3CLqGRNbvH
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022