దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇందులో ఎన్టీఆర్- రామ్ చరణ్ లకు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోలు తమ నటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. తర్వాత రామ్ చరణ్ తన తర్వాత సినిమాని డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్నాడు.RRR తర్వాత రామ్ చరణ్ జట్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.
కానీ మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం RRR సినిమా విడుదలయ్యి ఇప్పటికి చాలా రోజులు అవుతున్న ఖాళీగానే ఉంటున్నాడు. తన తర్వాతి సినిమాని కొరటాలశివతో చేస్తున్నట్లుగా ప్రకటించిన ఎన్టీఆర్.. ఇప్పటికీ ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఇప్పటికీ కొరటాల ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఉండడంతో దీంతో ఎన్టీఆర్ అభిమానులో ఫ్రస్టేషన్ తీవ్ర స్థాయికి చేరింది. అసలు ఎన్టీఆర్ కి సినిమాల మీద ఆశక్తి పోయిందా? ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడని సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు పెడితు ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త ఎన్టీఆర్ అభిమానులను టెన్షన్ పెడుతుంది. అదేమిటంటే కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాలు నటించడానికి ఆసక్తి చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి…RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ దగ్గరకు ఎంతో మంది దర్శకులు కథలు చెప్పడానికి వచ్చినప్పటికీ కూడా ఎన్టీఆర్ వారికి నో చెప్పేసారట. ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎన్టీఆర్ తన దృష్టి మొత్తం రాజకీయాల వైపు ఉందని.. అందుకే ఆయన సినిమాల మీద ఆసక్తి చూపించడం లేదని టాలీవుడ్ లో బలంగా టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.