సమంత శాకుంతలం సినిమా పరిస్థితి ఇలా అయిందేంటి..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ సమంత. సమంత తాజాగా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన శాకుంతలం సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం గత ఏడాది షూటింగ్ ను పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని అనువార్య కారణాలవల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. దాదాపుగా ఏడాది కాలం నుంచి ఈ సినిమా పనులు జరుగుతున్న ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

சமந்தா நடிக்கும் 'சகுந்தலம்' ஃபர்ஸ்ட் லுக் வெளியீடு | Samantha in  Shakunthalam First look - hindutamil.in
అయితే తాజా పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ సినిమా ఇప్పట్లో వచ్చేలా కనిపించలేదు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు.శాకుంతలం సినిమా తర్వాత సమంత నటించిన సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదని అభిమానులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. సమంత కూడా ఈ చిత్రం గురించి ఎక్కడ రివీల్ చేయలేదు. దీంతో ఈ సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందో అభిమానులకు అర్థం కాలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నప్పటికీ బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలు ఎక్కడ రాజీ పడలేదు. గతంలో అనుష్కతో కలిసి రుద్రమదేవి చిత్రాన్ని తెరకెక్కించి.. తన ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటో చూపించారు గుణశేఖర్. అలాంటి నమ్మకంతోనే సమంతతో శాకుంతలం సినిమానీ తెరకెక్కించారు గుణశేఖర్. కానీ ఈ సినిమా ఆలస్యమవుతున్న కొద్ది ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం వచ్చే ఏడాది కాకుండా 2024లో విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి చిత్ర బృందం ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో తెలియాలి.