మళ్ళీ విశాఖ ఎంపీగా పోటీ చేయడానికి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే విశాఖ వేదికగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జేడి..అక్కడ నుంచే పోటీ చేస్తానని ప్రకటించేశారు. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చిన జేడి..తనకు అనుకూలమైన పార్టీ నుంచి కూడా పోటీ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పుకొచ్చారు. కాకపోతే ఏ పార్టీ అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే ఆయన జనసేన పోటీ చేస్తారని..కాదు కాదు ఆయన టీడీపీ నుంచి బరిలో దిగవచ్చని ప్రచారం జరుగుతుంది.
గత ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి పోటీ చేసి..దాదాపు రెండు లక్షన్నర ఓట్లు పైనే తెచ్చుకున్నారు. ఆ స్థాయిలో ఓట్లు చీల్చడంతో విశాఖలో టీడీపీకి నష్టం జరిగింది. టీడీపీ నుంచి పోటీ చేసిన బాలయ్య చిన్నల్లుడు భరత్..4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ జేడి ఎంట్రీ ఇస్తానని చెప్పడంతో బాలయ్య చిన్నల్లుడు భవిష్యత్ పై టెన్షన్ మొదలైంది.
జేడి పోటీ వల్ల ఇక్కడ సమీకరణాలు రకరకాలుగా మారే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా జేడి పోటీ చేస్తానని అంటున్నారు..ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కొంతమేర ఓట్లు చీలుస్తారు. అలాగే జనసేన నుంచి పోటీ చేస్తే భారీ స్థాయిలో ఓట్లు చీలుస్తారు. ఒకవేళ టీడీపీ-జనసేన పొత్తు ఉంటే..అప్పుడు విశాఖ సీటు భరత్‌కు దక్కుతుందా? జేడికి దక్కుతుందా? అనేది డౌట్.
అంటే ఎటు వచ్చిన భరత్‌కు చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. అలా అని ఇండిపెండెంట్ గా, జనసేన నుంచి పోటీ చేసిన జేడికి గెలుపు అవకాశాలు తక్కువ..అదే టీడీపీతో పొత్తు ఉంటే గెలుపు అవకాశాలు ఉంటాయి. కానీ భరత్‌ని కాదని జేడికి సీటు ఇస్తారా? అనేది డౌట్. మరి విశాఖ ఎంపీ సీటు విషయంలో ఎలాంటి ట్విస్ట్‌లు వస్తాయో చూడాలి.