ఎక్స్‌క్లూజివ్: బాలయ్య నరసింహనాయుడు ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే షాక్ అవాల్సిందే…!

కొన్ని ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు గుర్తు చేసుకుంటే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అలానే సినిమా పరిశ్రమలో హీరోలు కూడా తమ కెరియర్‌లో ఎన్నో హిట్ సినిమాలను మిస్ చేసుకుని ప్లాప్ కథలకు ఓటు వేసేవారు. మరికోంద‌రు దర్శకుడు చెప్పిన కథతో సినిమా మొదలుపెట్టి తర్వాత ఆ కథతో కాకుండా వేరే కథతో సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి సంఘటనలో ఇది కూడా ఒకటి.. 2001లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘నరసింహనాయుడు’ సినిమా ఎలాంటి సెన్సేషనల్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే.

Narasimha Naidu(నరసింహ నాయుడు) Telugu Full Movie | Balakrishna, Simran,  Preeti Jhangiani - YouTube

ఇక ఆ సినిమా పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పాటలు, ఫైట్లు అన్నీ దేనికవే పోటీ పడుతూ గొప్ప విజయాన్ని అందించాయి. అయితే ఈ సినిమా వెనుక ఓ ఆసక్తికరమైన నేపథ్యం కూడా ఉంది. బాలకృష్ణకు ‘సమరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు
బి. గోపాల్ ఆ సినిమా తర్వాత బాలకృష్ణతో మరో సినిమా చేయాలని నిర్మాత మేడికొండ వెంకటరమణకు కమిట్‌ అయ్యారు. అందుకు అనుగుణంగా రచయిత పోసాని కృష్ణ మురళి అందించిన కథ.. పలు దఫాల చర్చల తర్వాత దానిని తీయాలని నిర్ణయించుకున్నారు.

ఇక వీరి కాంబోలో వచ్చిన‌ ‘రౌడీ ఇన్స్ పెక్టర్’ తరహాలో ఇది సెన్సేషనల్ హిట్ అవుతుందని భావించారు.
2000వ‌ సంవత్సరం ఫిబ్రవరి 10న అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ తో బాలకృష్ణ ఖాఖీ డ్రెస్సులో ఉండగా తీసిన షాట్ తో ఈ సినిమాను ప్రారంభించారు. ఇందులో బాలకృష్ణకు జంటగా సౌందర్య- సిమ్రాన్ హీరోయిన్లుగా ఎంపిక చేశారు. అందరూ బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో బాలకృష్ణకు మాత్రం ఈ సినిమా తన ఇమేజ్‌కు సూట్ అవ్వదు అనే అనుమానం బాలయ్యతో పాటు బి.గోపాలకు కూడా వచ్చింది.

బాలయ్య రికార్డుల వేటకి 18 ఏళ్ళు - 10TV Telugu

అక్కడితో ఈ సినిమాను ఆపేసి వేరే కథ కోసం వెతకడం మొదలు పెట్టారు.. ఆ సమయంలోనే రచయిత చిన్నికృష్ణ వచ్చి ఓ కథ చెప్పగా.. ‘ఒక ఊరిలో కుటుంబానికి కొడుకు బయటకు వచ్చి ఒక సైన్యంల మరి శత్రువుల నుంచి ఊరిని కాపాడే బలిదేవుడి’ లాంటి క్యారెక్టర్ తో చిన్నికృష్ణ చెప్పిన కథ నచ్చడంతో.. వెంటనే పరుచూరి బ్రదర్స్ కు కబురు పెట్టడం వాళ్ళు పవర్ఫుల్ డైలాగులతో స్క్రిప్ట్ సిద్ధం చేయడం అలా జరిగిపోయాయి. ఆ తర్వాత కట్ చేస్తే జరిగిన చరిత్ర అందరికీ తెలిసిందే. పోసాని ఇచ్చిన కథలో హీరో పేరు ‘నరసింహనాయుడు’ దాన్ని మాత్రం మార్చకుండా టైటిల్ కు వాడుకున్నారు. అలా 2001లో వచ్చిన ‘నరసింహనాయుడు’ బాలకృష్ణ కు టాలీవుడ్‌కు ఓ మైలురాయిగా మిగిలిపోయింది.