కేవ‌లం వాళ్లు చూసినా.. నా సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచేది: జాన్వీ క‌పూర్‌

దివంగ‌త న‌టి శ్రీ‌దేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ అంత ఇంతా కాదు. అస‌లు సినిమా ద్వారా కంటే సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తోనే జాన్వీ ఎక్కువ పాపుల‌ర్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ ఏకంగా 21 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్ ను టెంప్ట్ చేస్తూనే ఉంటుంది.

అయితే సోషల్‌మీడియాలో లభించే క్రేజ్ కేవలం వ్యక్తిగత ఛరిష్మాకు, బ్రాండ్‌ ప్రమోషన్‌కు మాత్రమే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని.. సినిమా విజయాన్ని అది ఏమాత్రం నిర్ణయించదని అంటోంది జాన్వీ. ఈ అమ్మ‌డు రీసెంట్ గా `మిలి` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిచింది. సర్వైవర్‌ థ్రిల్లర్‌ సినిమా ఇది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కులు ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది.

అయితే తాజాగా ఓ స‌మావేశంలో మాట్లాడుతూ.. తన తాజా చిత్రం ‘మిలీ’ కి ఆశించినంతగా వసూళ్లు రాలేదని, ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో అవుతున్న 21 మిలియన్ల అభిమానులు ఆ సినిమా చూసినా సూప‌ర్ హిట్‌గా నిలిచేదని చమత్కరించింది. అలాగే సోషల్ మీడియా సెల్ఫ్ ప్రమోషన్‌ కోసమే. అదో టైమ్ పాస్‌ వ్యవహారం. సినిమా తాలూకు స్టార్‌డమ్‌, వసూళ్లను సోషల్‌మీడియా ఎప్పటికీ ప్రభావితం చేయలేద‌ని జాన్వీ చెప్పుకొచ్చింది.