స్టుపిడ్.. అదేంటి నాని ఆ హీరోయిన్ ను అంత మాటన్నాడు?

నాచురల్ స్టార్ నాని ఓ హీరోయిన్ ను స్టుపిడ్ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ నాని స్టుపిడ్ అన్నది మరెవరినో కాదు మలయాళ నటి నజ్రియా నజీమ్ ను. అసలెందుకు నాని ఆమెను అంత మాట అన్నాడు తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

నిన్న నజ్రియా పుట్టినరోజు. దీంతో సినీ తారలు మరియు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నాని సైతం ఓ పోస్ట్ పెట్టాడు. న‌జ్రియా మరియు తన భార్య అంజనతో కలిసి దిగిన ఓ క్యూట్ పిక్ ను షేర్ చేస్తూ `హ్యాపీ బర్త్డే స్టుపిడ్ త్వరలోనే కలవాలి` అంటూ కామెంట్ చేశాడు.

నాని హీరోగా తెరకెక్కిన `అంటే సుందరానికి` సినిమాతోనే న‌జ్రియా తెలుగు తెరకు పరిచయం అయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వ వహించిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ అవ్వ‌లేకపోయింది. అయితే ఈ సినిమా సమయంలోనే నాని, న‌జ్రియా మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. నాని భార్య అంజనకు సైతం న‌జ్రియా బాగా దగ్గర అయింది. ఆ సన్నిహిత్యంతోనే నాని స్టుపిడ్ అంటూ కామెంట్ చేశాడు.