నా క్ర‌ష్ ఆ హీరోనే.. బాల‌య్య ప్ర‌శ్న‌కు రాశి ఖ‌న్నా డేరింగ్ ఆన్స‌ర్‌!

అందాల భామ రాశిఖన్నా తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదిక‌గా నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్య‌వహరిస్తున్న టాక్‌ షో `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. సీనియర్ స్టార్ హీరోయిన్లు జయసుధ, జయప్రద తో కలిసి రాశి కన్నా ఈ షోలో ఈ సంద‌డి చేసింది.

ముగ్గురు భామ‌ల‌ మధ్య బాలకృష్ణ నారి నారి నడుమ నందమూరి అంటూ చిలిపి అల్లరి చేశారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. అయితే ఈ షోలో బాలయ్య రాశి ఖ‌న్నాను.. `నువ్వు నటించిన హీరోల్లో నీకు ఎవరి మీద క్రష్ ఉంది` అంటూ ప్రశ్నించారు. అందుకు రాశి కన్నా ఏమాత్రం తడబ‌డకుండా వెంటనే విజయ్ దేవరకొండ అంటూ డేరింగ్ ఆన్సర్ ఇచ్చింది.

ఇప్పటివరకు రాశి ఖ‌న్నా తన క్రష్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ తొలిసారి బాలకృష్ణ షోలో విజ‌య్ తన క్రష్ ఎవరో బయటపెట్టింది. కాగా, గతంలో విజయ్ దేవరకొండతో క‌లిసి రాశి ఖ‌న్నా `వరల్డ్ ఫేమస్ లవర్` సినిమాలో నటించింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాలో రాశి ఖ‌న్నా బోల్డ్ గా నటించడం వల్ల ఆమెపై విమర్శలు సైతం వచ్చాయి.