ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టీమ్ ఇండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో తన కెరియర్ లోనే మొదటి డబుల్ సెంచరీ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ కు ఇండియాకు జరిగిన చివరి మ్యాచ్ లో ఇషాన్ చెలరేగిపోయాడు. డబల్ సెంచరీ చేసి టీమ్ ఇండియా విజయం సాధించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. ఇషాన్ ఈ సూపర్‌ ఇన్నింగ్స్‌కు సాక్షిగా నిలిచిన కోహ్లీ మొదలు వీరేంద్ర సెహ్వాగ్, హార్థిక్ పాండ్యా, సచిన్ టెండుల్కర్.. ఇలా ఇండియన్ క్రికెటర్లందరూ ఇషాన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Ishan Kishan girlfriend Aditi Hundia post an instagram story, see viral post

ఇక ఇప్పుడు ఈ ముంబై ప్లేయర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. వీరందరితోపాటు ఇషాన్ కు ఎవరు ఊహించని ఓ స్పెషల్ పర్సన్ నుంచి శుభాకాంక్షలు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆమె ఎవరో కాదు ఇషాన్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న అదితి హుండియా. ఈ క్రమంలోనే ఇషాన్ ఫోటోలను తన సోషల్ మీడియాలో అతిథి షేర్ చేసింది. ఆ ఫోటోలకు రెడ్‌ హార్ట్‌ ఎమోజీతో తన ప్రేమను చాటుకుంది.

Meet Ishan Kishan Girlfriend Aditi Hundia, The Supermodel Cricketer Is  Dating

వీటితోపాటు ఇషాన్ స్పెషల్ ఇన్నింగ్స్ కు సంబంధించిన బీసీసీఐ షేర్ చేసిన పోస్ట్ ని కూడా ఆమె రిషేర్ చేసింది. ఇప్పుడు ఒక్కసారిగా ఇషాన్, అదితి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ అతిధి మ‌రి ఎవరో కాదు 2019 మిస్ ఇండియా పోటీలలో ఫైనల్ వరకు వెళ్ళింది.. ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనర్‌గా, మోడల్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తూ.. ఈ ముద్దుగుమ్మ ఇషాన్ లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తిగా, అతని ప్రేయసిగా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. వీరిద్దరూ పలుసార్లు జంటగా మీడియాకు కూడా దర్శనమిచ్చారు.

ప్రధానంగా ఐపీఎల్‌లో ఇషాన్ ప్రాతినిథ్యం వహిస్తోన్న మ్యాచ్‌లకు ముంబై జెర్సీ వేసుకుని ఎన్నోసార్లు మ్యాచ్‌లకు వచ్చింది. అలాగే వీటితోపాటు తన ఇన్ స్టాలో ఆమె పెట్టే పోస్టులకు ఇషాన్, ఇషాన్ పెట్టే పోస్టులకు అదితి రిప్లేలు ఇచ్చుకుంటుంటారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గ‌త‌ కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్ద‌రు త‌మ‌ రిలేషన్ గురించి ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ తో చివరి మ్యాచ్‌లో ఇషాన్ చెలరేగి ఆడటంతో అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ అతిథి షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.