వీరయ్య కోసం చరణ్ చొక్కా వేసుకు వ‌చ్చేసిన చిరంజీవి…!

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా మెగాస్టార్ చిరంజీవి- మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇప్పటికీ ఈ సినిమా నుంచి నాలుగు పాటలు విడుదల అవ్వగా ఇవి ఒక పాటను మించి మరో పాట భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి నిన్న వచ్చిన మెగా పూనకాలు అంటూ వచ్చిన పాట కూడా మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా అదిరిపోయే మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు.

PoonakaaluLoading Song | Waltair Veerayya 4th Song | #waltairveerayya | Waltair Veerayya Trailer - YouTube

ఇక మరో విశేషం ఏమిటంటే ఈ పాటలో చిరంజీవి- రవితేజ కూడా గొంతు కలిపారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో సూపర్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అయితే ఈ సాంగ్‌లో చిరు వేసిన షర్ట్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఇక అందులో చిరు ఎరుపు రంగు పూలచొక్కా వేసుకుని మాస్ స్టాప్ లతో అదరగొట్టాడు. అయితే ఆ షర్టుతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా ఓ సంబంధం ఉంది.

అది ఏమిటంటే సేమ్ అదే కలర్ షర్ట్ ను ధరించి రామ్ చరణ్ కూడా ఓ కమర్షియల్ యాడ్ లో నటించాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి- రామ్ చరణ్ షర్టును వేసుకున్నాడు అంటూ ఇద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే ఒకేలాంటి డిజైన్ ఉన్న షర్ట్ లో మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందంగా ఫీల్ అవుతున్నారు.