ఈ ఏడాదంతా ఇండియన్ సినీ ఇండస్ట్రీని కన్నడ ఏలేసిందిగా..!

ఒకప్పుడు ప్రేక్షకులకు కన్నడ ఇండస్ట్రీపై, కన్నడ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తుంటారు. అంతేకాకుండా, రొటీన్ కథలనే ఎక్కువగా ఫాలో అవుతారు కన్నడ డైరెక్టర్లు. దాంతో కన్నడ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు ప్రేక్షకులు. అయితే అదంతా ఒకప్పటి మాట. ఇక ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికోసం దేశమంతా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలకు క్రేజ్ అంతా ఇంత కాదు.

2018లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ సినిమా సినీ ప్రేమికులను కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్, యష్ పేర్లు దేశమంతటా వినిపించాయి. దాంతో అందరూ కేజీఎఫ్ 2 సినిమా కోసం ఎదురు చూసారు. 4 ఏళ్లు తరువాత అంటే 2022లో వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసింది. దాదాపు రూ.1,200 కోట్లు వసూలు చేసి దేశమంతటా కన్నడ ఇండస్ట్రీ రేంజ్ ని పెంచేసింది. ఇక ఆ తరువాత నుంచి శాండల్‌వుడ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూనే ఉన్నాయి.

ఇక హీరో కమ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన ‘చార్లీ 777 ‘ సినిమా కూడా ఇండియన్ బాక్సాఫీస్‌ని ఒక రేంజ్‌లో ఉపేసింది. ఆ తరువాత కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘విక్రాంత్ రోనా ‘ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన మరో సినిమా ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది . ఈ సినిమాకి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, ఆయనే హీరోగా నటించాడు. రూ.16 కోట్లతో రూపొందిన కాంతార సినిమా రూ.5,00 కోట్లు వసూలు చేసింది. ఈ విధంగా కన్నడ సినిమాలు 2022లో ఇండియన్ బాక్సఫీస్ వద్ద ఒక రేంజ్ ని సృష్టించాయి.